రెండు బైకులు ఢీ.. పంచాయతీ ఉద్యోగి దుర్మరణం
ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో పాపన్నపేట గ్రామ పంచాయతీ ఉద్యోగి దుర్మరణం చెందిన సంఘటన మెదక్ జిల్లా లో చోటు చేసుకుంది.
పాపన్నపేట, ఆగస్టు10 : ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో పాపన్నపేట గ్రామ పంచాయతీ ఉద్యోగి దుర్మరణం చెందిన సంఘటన మెదక్ జిల్లా పాపన్న మండల పరిధిలోని యూసుఫ్ పేట గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. పాపన్నపేట గ్రామానికి చెందిన ఆకుల కృష్ణ (40) పాపన్నపేట పంచాయతీ కార్యాలయంలో కారోబార్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం తన ద్విచక్రవాహనం పై బంధువైన వెంకట్ తో కలిసి కొత్తపల్లి వైపు నుంచి పాపన్నపేట వైపు వెళుతున్నాడు.
ఇదే క్రమంలో వైపు ముస్లాపూర్ వైపు నుండి వస్తున్న బైక్ యూసుఫ్ పేట గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా ఢీ కొనడంతో కృష్ణ రోడ్డుపై పడ్డారు. దీంతో అతడికి తలకు తీవ్ర గాయాలు అయ్యి తీవ్ర రక్త స్రావం అయింది. ఈ విషయం గమనించిన స్థానికులు వెంటనే 108, పాపన్నపేట పోలీసులకు సమాచారం అందివ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షత్తగాత్రులను మెదక్ ఏరియా హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కృష్ణ మృతి చెందినట్లు పరీక్షించిన డాక్టర్లు నిర్ధారించారు. కాగా మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. ఈ సంఘటనతో పాపన్నపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

