సంగారెడ్డి, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): సం గారెడ్డి జిల్లాలో రెండోరోజు సోమవారం మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిశాయి. పలు ప్రాం తాల్లో పాక్షికంగా ఇండ్లు దెబ్బతిన్నాయి.విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుంది. పుల్కల్ మండలంలోని ఇసోజిపేట వద్ద సింగూ రు ప్రాజెక్టు ఎడమకాల్వకు గండిపడింది. వర్షాలతో సింగూరు, నల్లవాగు ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద వస్తోంది. సంగారెడ్డి మండలం కల్పగూరులోని మంజీరాడ్యామ్ నిండటంతో ఒకగేటు ఎత్తి నీటిని కిందికి వదిలారు.
సంగారెడ్డి జిల్లాలో 623 ఎకరాల్లో పంటలు నీటమునిగా యి. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంజీరా డ్యామ్‌ను పరిశీలించి వర్షాలపై సంగారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించి ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా చర్యలకు ఆదేశించారు. జిల్లాలో 6 సెం.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. మనూరు మండలంలో అత్యధికంగా 9.3 సెం.మీటర్ల వర్షం కురిసింది. 11 మండలాల్లో అధికంగా, 15 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
నారాయణఖేడ్, కల్హేర్, న్యాల్కల్, పటాన్చెరు మండలాల్లో 27 ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. పటాన్చెరు మండలం చిట్కుల్లోని లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు నీటమునిగాయి. పటాన్చెరు, అమీన్‌పూర్‌లోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కొత్త కాలనీల్లో ఇండ్లు నీటమునిగాయి. పటాన్‌చెరులోని నక్కవాగు ఉప్పొంగి ప్రవహించడంతో ముత్తంగి-పోచారం ఔటర్ సర్వీసు రోడ్డు పూర్తిగా జలమయమైంది.
పోలీసులు బారికేడ్లు పెట్టి వాహనరాకపోకలను నిలిపివేశారు. పటాన్చెరు మండ లం పాటిఘనపురంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ నీట మునిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సిబ్బంది మోటర్ల ద్వారా నీటిని తోడేశారు. స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. వర్షాలతో 623 ఎకరా ల్లో పంటలు నీటమునిగాయి. జహీరాబాద్, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లో పం టలు నీటమునిగాయి. 258 ఎకరాల్లో సోయాబీ న్, 50 ఎకరాలో ్లమినుము, 28 ఎకరాల్లో పెసర, 171ఎకరాల్లో కంది, 102ఎకరాల్లో పత్తి, 14 ఎకరాల్లో కూరగాయ పంటలు నీటమునిగాయి.
సంగారెడ్డి జిల్లాలో 50 చెరువులు అలుగు పారుతున్నాయి. మొత్తం 1769 చెరువులు ఉండగా, 50 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. సంగారెడ్డి ఇరిగేషన్ సబ్ డివిజన్లో 16, జహీరాబాద్ డివిజన్లో 21, నారాయణఖేడ్ డివిజన్లో 9, హత్నూరలో నాలుగు చెరువులు అలుగు పోస్తున్నాయి. జిల్లాలో 24 చెరువులు పూర్తిగా నిం డగా, 686 చెరువులు 75 శాతం , 889 చెరువుల్లోకి 50 శాతం వర్షపునీరు వచ్చింది.
సింగూరు, నల్లవాగు ప్రాజెక్టులోకి వరద వస్తున్న ది. సింగూరు ప్రాజెక్టులోకి సోమవారం 23942 క్యూసెక్కుల నీళ్లు వచ్చాయి. సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టులోకి 338 క్యూసెక్కుల వరద వచ్చింది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 655 ఎంసీఎఫ్‌టీకి చేరుకుంది. మంజీరా నిండడంతో ఒక గేటు ఎత్తి దిగువకు 3100 క్యూసెక్కుల జలాలు వదిలారు. పుల్కల్ మండలం ఇ సోజిపేట వద్ద సింగూరు ప్రాజెక్టు ఎడమకాల్వకు గండిపడి నీరంతా పొలాల్లోకి ప్రవహించాయి. ఎడమ కాల్వకు గతేడాది కూడా గండిపడింది.