చేగుంట, సెప్టెంబర్ 11: మెదక్ జిల్లా చేగుంట మండలంలోని సహకార సంఘాల్లో అక్రమాల పై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి జిల్లా సహకార శాఖ అధికారులు స్పందించారు. బుధవారం చేగుంట మండలంలోని రెడ్డిపల్లి సహకార కార్యాలయంలో సీనియర్ ఇన్స్పెక్టర్ సంగమేశ్వర్,
ఇబ్రహీంపూర్ సహకారం సంఘానికి సంబంధించి చేగుంట సహకార సంఘం లో ఆడిట్ అధికారి ఫయాజుద్దీన్ రికార్డులను పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేర కు ఇబ్రహీంపూర్, రెడ్డిపల్లి సహకార సంఘాల్లో రికార్డులను పరిశీలించామని, పూర్తి విచారణ అ నంతరం నివేదికలు అందజేస్తామని తెలిపారు.