Padma devender reddy | విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కూడా లేవు : పద్మా దేవేందర్ రెడ్డి
Padma Devender Reddy | మెదక్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కూడా లేవని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 120 మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉండటం దురదృష్టకరమని అన్నారు.
Padma devender reddy | మెదక్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలను మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సమస్యల పరిష్కారానికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME)కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. 120 మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉండటం దురదృష్టకరమని అన్నారు. అలాగే విద్యార్థులకు నాణ్యతలేని ఆహారం అందిస్తున్నారని, కుళ్లిపోయిన కూరగాయలతో వంటలు చేస్తున్నారని మండిపడ్డారు. కళాశాలలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థుల నుంచి అదనపు మెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులను బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలని హెచ్చరించారు. వారం రోజుల్లోనే కళాశాలలో అన్ని మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని ప్రభుత్వం, అధికారులకు గడువు విధించారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.
గతంలో తమ ప్రభుత్వ హయాంలో మెడికల్, నర్సింగ్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని గుర్తు చేస్తూ, ప్రస్తుతం ప్రభుత్వం వాటిలో సరైన సదుపాయాలు కల్పించడం లేదని విమర్శించారు.
విద్యార్థులు మంచి శిక్షణ పొందితే భవిష్యత్తులో సమాజానికి మెరుగైన సేవలు అందిస్తారని పేర్కొన్నారు. వీరి వెంట మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మెదక్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మామిళ్ల ఆంజనేయులు. న్యాయవాది జీవన్ రావు, పట్టణ , కౌన్సిలర్లు బట్టి ఉదయ్, దీపక్ కుమార్, నాయకులు లింగా రెడ్డి, సురేందర్ గౌడ్,కిష్ట గౌడ్, మాయ మల్లేశం , ఆర్కే శ్రీనివాస్, సంతోష్, సాయి కుమార్, నవీన్, బాలరాజు, శ్రీలత వెంకట్ ,కిరణ్, స్వామి నాయక్ తదితరులు ఉన్నారు.

Read Also :
Macherla ASI | ఏకాంతంగా ఉన్న జంటలను రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. మాచెర్ల ఏఎస్సై నిర్వాకం
Asha Bhosle | బాలీవుడ్లో విషాదం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి
Inter Supplementary Exams | మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

