సిర్గాపూర్, ఆగస్టు 12 : మండలంలోని జమ్లాతండా పంచాయతీ తోళ్యాతండాకు చెందిన హరిలాల్ అనే యువకుడు శుక్రవారం కూరగాయలతో జాతీయ జెండాను రూపొందించి తన దేశభక్తిని చాటుకున్నాడు.
ఘర్ ఘర్ తిరంగా, 75 సంవత్సరాల వజ్రోత్సవాల సందర్భంగా ఎర్రటి రంగు కోసం టమాటలు, మధ్యలో శ్వేత వర్ణం పేపర్ , దాంట్లో దొమల బత్తి చక్రం, అడుగు భాగంలో ఆకుపచ్చ దొండకాయలను క్రమంగా ఉంచి జాతీయ జెండా ఆకారాన్ని రూపొందించాడు. ఈ చిత్రాన్ని సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.