నర్సాపూర్, ఫిబ్రవరి 25: ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరమని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చిన్నచింతకుంట గ్రామ సమీపంలో గల శ్రీనివాస గార్డెన్స్‌లో 2024 నేషనల్ ఓపెన్ కుంగ్ ఫూ కరాటే చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో కరాటే మాస్టర్, ప్రోగ్రామ్ కన్వీనర్ పోచయ్య, కరాటే మాస్టర్ పాముల శ్రీనివాస్, వినోద్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యంగౌడ్, మాజీ జడ్పీటీసీ చౌటి మాధవి జగదీశ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు తొంట వెంకటేశ్, సూరారం నర్సింహులు, మహమ్మద్, షేక్ హుస్సేన్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.