Mynampally Hanumanth Rao | రాష్ట్రంలో త్వరలో విడతల వారీగా సర్పంచ్ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నేను చెప్పినట్టు చేయాలే అంటూ ఓ కాంగ్రెస్ నేతకు ధమ్ కీ ఇచ్చిన ఆడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మనకు ఆడ గెలిచినంక.. పార్టీ బలంగా మారినంక ఏదైనా ఔట్రైట్ ఉంటా నేను. మనది ఇంక మూడేళ్లు ఉంటది. నెక్ట్స్ కూడా ఎవని అయ్యకు ఇనం. నెక్ట్స్ కుప్పిపడేస్తా నేను.. ఊర్లు ఊర్లు కొనేస్తా నేను నెక్ట్స్ టైం.. సమస్య ఉండదు.. మనం ఖర్చు పెట్టినట్టు వాళ్లేం పెడ్తరు. వాళ్లు వంద కోట్లు పెడితే.. రెండు వందల కోట్లు నేను. మీరు గట్టిగ్కావలే.. నేను చెప్పేది విను శీనన్నా.. అరే మొండి మాటలు మాట్లాడతరు.
రాజకీయం ఏం చేస్తం మేం ఇగ గిట్ల జేస్తే… నాకున్నది రిపోర్ట్..నేను తీసుకొనే ఇది జేస్తున్న కదా..నేను చిన్న పిలగాడిని కాదు కదా.. నాకు ఏడ గెలుస్తది ఏడ గెలువది అని నా దగ్గర మొత్తం రిపోర్టు ఉన్నదన్నారు. ఫోన్ కాల్లో ఉన్న వ్యక్తి రిపోర్ట్ ఆడ కాదు కదా ఒక సారి ఊర్లే తెలుసుకో అని అంటే.. అరే ఊర్లెనేనే మొత్తం సర్వే రిపోర్ట్ చేపిస్తున్నా. చెప్పినంక నువ్వు నమ్మకపోతే ఎట్లా..నువ్వు 200 శాతం చెప్తున్నా నువ్వు గెలవవు. నేను చెప్తే వినకపోతే ఎట్ల నువ్వు.. అరె మొండిమాటలు మాట్లాడితే.. నేను చెప్పినోడు నామినేషన్ వేయాలంటూ మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ నేతకు దమ్కి ఇచ్చిన ఆడియో పుటేజీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ నేతకు దమ్కి ఇచ్చిన మైనంపల్లి హన్మంతరావు కాల్ రికార్డింగ్ లీక్
ఎవడి అయ్యకు వినను.. ఊర్లు ఊర్లు కొనేస్తా
రూ.200 కోట్లు అయినా పెడతా నేను
నేను చెప్పినోడు నామినేషన్ వేయాలంటూ కాంగ్రెస్ నేతకు దమ్కి ఇచ్చిన మైనంపల్లి హన్మంతరావు pic.twitter.com/JtfepeRaRR
— Telugu Scribe (@TeluguScribe) December 3, 2025
Mahabubabad | లారీని ఢీ కొన్న బైక్.. రైల్వే ఉద్యోగి మృతి
Jyotiraditya Scindia: సంచార్ సాథీ యాప్‌తో స్నూపింగ్ జరగదు: లోక్‌సభలో మంత్రి సింథియా