సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 2: ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల విధులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి సూచించారు. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాలలో కొనసాగుతున్న పీవో, ఏపీవో, ఓపీవోల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ ఏజెంట్లకు సీక్రెసీ ఓటింగ్, పోలిం గ్ నియమాలను వివరించాలన్నారు. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలిం గ్ నిర్వహించాలని, మాక్ పోలింగ్‌లో 50కి తక్కువ కాకుండా ఓట్లు వేయాలన్నారు.
ఫలితాలు తర్వాత ఈవీఎం యంత్రాన్ని క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. అనంతరం అసలైన పోలింగ్‌కు సన్నద్ధం కావాలన్నారు. బ్యాలెట్, కంట్రోల్ యూని ట్లు, వీవీ ప్యాట్లను పోలింగ్ కేంద్రాల్లో అమర్చడంపై అవగాహన ఉండాలన్నారు. హ్యాండ్‌బుక్‌లోని ప్రతి అంశాన్ని తెలుసుకోవాలన్నా రు. పోలింగ్ ప్రాంతం, ఓటర్ల వివరాలు తెలి పే నోటీసు బోర్డులు, ఫారం-7లో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను పోలింగ్ స్టేషన్ బయట ప్రదర్శించాలన్నారు. విధుల్లో పాల్గొ నే వారు ఫారం-12, ఫారం-12ఏ ద్వారా ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్, పోస్టల్ బ్యాలెట్లు పొంది విధిగా ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు.అనంతరం స్ట్రాంగ్‌రూమ్, ఈవీ ఏం డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించారు.