రుణాల మంజూరులో ముందున్నాం
మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించడంలో సిద్దిపేట మొద టి స్థానంలో ఉందని మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు అన్నా రు. సిద్దిపేట మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ ద్వారా దేశవ్యాప్త గుర్తింపు లభించిందన్నారు.
సిద్దిపేట, జూలై 25 : మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించడంలో సిద్దిపేట మొద టి స్థానంలో ఉందని మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు అన్నా రు. సిద్దిపేట మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ ద్వారా దేశవ్యాప్త గుర్తింపు లభించిందన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మహిళా శక్తి పథకం, వీధి కుకల బెడద, సీజనల్ వ్యాధుల నివారణపై పట్టణ ఆర్పీలు, టీఎల్ఎఫ్ ఓబీలు, మహిళా స్వ యం సహాయక బృందాల సభ్యులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు.
సిద్దిపేట స్టీల్ బ్యాంకు భారత ఆర్థిక సర్వేలో చోటు లభించడంలో ఆర్పీలది కీలకపాత్ర అన్నారు. మాజీమంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు, మున్సిపల్ పాలకవర్గం, అధికారుల కృషితో నేడు సిద్దిపేటకు దేశ స్థాయి లో గుర్తింపు లభించిందన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రసన్నారాణి, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, మెప్మా డీఎం సీ హనుమంత రెడ్డి, టీఎంసీ సాయి కృష్ణ, ఆర్పీ రమ్య జ్యోతి, మహిళా స్వయం సహయక బృందాల సభ్యులు పాల్గొన్నారు.
వ్యాపార, ఉపాధి రంగాల్లో మహిళలు రాణించాలి
దుబ్బాక, జూలై 25 : స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని వ్యాపార, ఉపాధి తదితర రంగాల్లో రాణించాలని దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి సూచించారు. గురువారం దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో మహిళా సంఘాల అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ , మిషన్ శక్తి-జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో మెప్మా ఆర్పీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల హక్కులు, చట్టాలు, సామాజిక సమస్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా మహిళా సంక్షేమాధికారి శారద, మున్సిపల్ కమిషనర్ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

