గుమ్మడిదల, జూన్ 20: మండల కేంద్రం లో గురువారం ఎంపీడీవో నూతన కార్యాలయాన్ని సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎంపీపీ సద్ధి ప్రవీణావిజయభాసర్ రెడ్డి ప్రారంభించారు. బొంతపల్లి పారిశ్రామికవాడలోని శ్యామ్ పిస్టన్ రింగ్స్ లిమిటెడ్ పరిశ్రమ సీఎండీ అందించిన రూ.60 లక్షల సీఎస్ఆర్ నిధులతో నూతన భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా పరిశ్రమ హెచ్ఆర్ మేనేజర్ వెంకటరాజును సన్మానించారు.
అనంతరం నూతన భవనంలో ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీపీ సద్ధి ప్రవీణాభాసర్ రెడ్డి తన చాంబర్లో పాలనను ప్రారంభించారు. భవనంలోని గదులను పరిశీలించిన అదనపు కలెక్టర్, జడ్పీ చైర్పర్సన్ మోడల్‌గా నిర్మించారని అభినందించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పారిశ్రామికవాడల్లో సీఎస్ఆర్ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్న పాపనీకుమార్ గౌడ్, వైస్‌ఎంపీపీ నక మంజులావెంకటేశ్ గౌడ్, ఎంపీడీవో ఉమాదేవి, తాసిల్దార్ గంగాభవాని,
మండల ప్రత్యేకాధికారి అఖిలేశ్‌రెడ్డి, ఎంపీటీసీలు ప్రభాకర్‌రెడ్డి, రాజలక్ష్మి, లక్ష్మి , పద్మాకొండల్ రెడ్డి, మద్ది మల్లమ్మ, పార్వతమ్మ, నాగేందర్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, మాజీ సర్పంచులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయం ప్రారంభోత్సవ శిలాఫలకం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ప్రొటోకాల్ రగడ కొనసాగింది. ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాటు చేయలేదని కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు చేశారు. ప్రొటోకాల్ ప్రకారమే ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.