నర్సాపూర్, ఫిబ్రవరి 24: పటాన్చెరు ఓఆర్ఆర్పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబసభ్యులను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. దుఃఖసాగరంలో మునిగిపోయిన వారిని ఓదార్చి ఆత్మైస్థెర్యం, ధైర్యాన్ని చెప్పారు. బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఉన్నారు.