రామచంద్రాపురం,డిసెంబర్ 4: రాకింగ్ రాకేశ్ నిర్మించిన కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్) సినిమాను సం గారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని సంగీత థియేటర్లో బుధవారం ప్రదర్శించారు. పటాన్చెరు నియోజకవర్గ నాయకుడు వెన్నవరం ఆదర్శ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శించిన సినిమాను చూసేందుకు బీఆర్ఎస్ శ్రేణు లు భారీగా తరలివచ్చారు. బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కార్పొరేటర్లు సింధూఆదర్శ్‌రెడ్డి, మెట్టు కుమార్‌యాదవ్ సంగీత థియేటర్లో సినిమాను ప్రారంభించి తిలకించారు.
కేసీఆర్ సినిమా ప్రదర్శనతో సంగీత థియేటర్ గులాబీమయమైంది. జై కేసీఆర్..జైజై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ సాధనకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలను సినిమాలో కండ్లకు కట్టినట్లు చూపించారన్నారు. తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ సినిమాను చూడాలని వారు కోరారు. కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.