అబద్ధ్దాలు కావాలా? దుబ్బాక అభివృద్ధి కావాలా?
‘దుబ్బాక అభివృద్ధి కావాలా.. అబద్ధ్దాలు కావాలా తేల్చుకోవాలి.. కొత్త ప్రభాకర్‌ను గెలుపించుకొని.. కొత్త దుబ్బాకను ఆవిష్కరించుకుందాం’.. అని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం దుబ్బాకలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..
- దుబ్బాకపై సీఎం కేసీఆర్‌ది కన్నతల్లి ప్రేమ
- కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలవగానే మరిన్ని పింఛన్లు ఇస్తాం
- త్వరలో రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం..
- అసైన్డ్ భూములున్న రైతులకు పట్టాలిస్తాం..
- భూములు గుంజుకుంటమని బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు..
- బీజేపీ నేతలవి అసత్య ఆరోపణలు
- నేడో, రేపో రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సాయం
- దుబ్బాక సభలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు
సిద్దిపేట/ దుబ్బాక/ దుబ్బాక టౌన్/ మిరుదొడ్డి/ తొగుట, నవంబర్ 26( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘దుబ్బాక అభివృద్ధి కావాలా.. అబద్ధ్దాలు కావాలా తేల్చుకోవాలి.. కొత్త ప్రభాకర్‌ను గెలుపించుకొని.. కొత్త దుబ్బాకను ఆవిష్కరించుకుందాం’.. అని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం దుబ్బాకలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. దుబ్బాకలో ఈసారి దుమ్ము రేగాలన్నారు. ఝూటా మాటలు చెప్పిన వ్యక్తిని నమ్మితే డీలా పడినట్లు తెలిపారు. అబద్ధ్దాల బీజేపీని నమ్మితే మూడేండ్లు వెనక్కి పోయామని, మళ్లీ వారి మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. దుబ్బాక మీద ప్రేమ కేసీఆర్‌కే ఉంటుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలది దుబ్బాక మీద సవతితల్లి ప్రేమ అని.. కేసీఆర్‌ది కన్నతల్లి ప్రేమ అన్నారు. కన్నతల్లి ప్రేమ కలిగిన కేసీఆర్‌కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
పేదలు కడుపునిండా తినాలని ప్రతి రేషన్ కార్డు దారుకు సోనామసూరి బియ్యం ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో ఇంటింటికీ మంచినీళ్లు, కాళేశ్వరం నీళ్లు వచ్చి రెండు పంటలు పండుతున్నట్లు చెప్పారు. 11 సార్లు ఛాన్స్ ఇస్తే ఏమి అభివృద్ధి చేయని పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. నాడు దొంగ రాత్రి కరెంట్ ఉంటే.. నేడు 24 గంటలు ఇస్తున్నారా లేదా అన్నారు. కటుక వేస్తే వచ్చే కరెంట్ కావాల్నా.. కర్ణాటక కారు చీకట్లు కావాల్నా ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు బోర్లకాడ మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలని చెబితే.. ఎట్టి పరిస్థితుల్లో పెట్టమని సీఎం కేసీఆర్ ఖరాఖండీగా చెపిన్నట్లు మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. మీటర్లు పెడితే రూ.28 వేల కోట్లు ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ చెప్పారన్నారు. తనకు 69 లక్షల రైతుల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి కేసీఆర్ వారి డబ్బులను తిరస్కరించినట్లు తెలిపారు.
ప్రభాకర్‌రెడ్డి గెలవగానే మరిన్ని పింఛన్లు ఇస్తాం..
కరెంట్ కావాల్నా.. కాంగ్రెస్ కావాల్నా ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. రైతుబంధును కాంగ్రెస్ వాళ్లు కాపీ కొట్టారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు వస్తే రైతుబంధు రాదన్నారు. రైతుబంధు కావాల్నా.. కాంగ్రెస్ కావాల్నా ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువుల కోసం, లోన్ల కోసం, విత్తనాల కోసం, పంట ఉత్పత్తులు అమ్మడం కోసం, మంచినీళ్ల కోసం లైన్ల నిలబడడామని తెలిపారు. నేడు ఆ పరిస్థితి ఉందా అన్నారు. యాసంగిలో రైతుబంధు వేద్దామంటే కాంగ్రెస్ వాళ్లు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని.. కానీ, న్యాయం, ధర్మం గెలుస్తుంది కాబట్టి ఎన్నికల కమిషన్ రైతుబంధు ఇవ్వడానికి అనుమతిచ్చినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రేపోమాపు రైతులందరి ఫోన్లకు టింగ్టింగ్ మని రైతుబంధు పడ్డట్లు మేసేజ్ వస్తుందన్నారు.
కేసీఆర్ వచ్చిన తరువాత మిషన్ భగీరథ నీళ్లు ప్రతి ఇంట్లోకి వస్తున్నాయా లేదా ప్రతి మహిళ ఆలోచించాలన్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలవగానే.. రూ.5 వేల పెన్షన్ వస్తుందని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ సంపద పెంచి.. పేదలకు పంచుతుండన్నారు. సీఎం కేసీఆర్‌కు బీడీలు చేసే కష్టం తెలుసు కనుక.. బీడీ కార్మికులకు పింఛన్ ఇచ్చి ఆదుకున్నాడన్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలవగానే మిగిలిపోయిన పింఛన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిపోయిన రైతుల పంట రుణమాఫీ త్వరలో పూర్తి చేస్తామన్నారు. మొన్నటి వరకు అబద్ధ్దపు హామీలు ఇచ్చిన నాయకులు.. నేడు భూములు తీసుకుంటారని ఇంకో కథ చెబుతున్నారని బీజేపీ నేతల తీరుపై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అసైన్డ్ భూములు ఉన్న ప్రతి లబ్ధ్దిదారుడికి పట్టా భూములు ఇచ్చి ఓనర్లుగా మార్చుతామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

