హుస్నాబాద్, ఆగస్టు 4: ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛదనం-పచ్చదనం’కార్యక్రమంపై అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సం స్థల ప్రతినిధులు ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని రాష్ట్ర రవాణా, బీసీ సం క్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం హుస్నాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, నా యకులతో కలిసి స్నేహితుల దినోత్సవంలో పాల్గొన్న అనంతరం పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ..ఈనెల 5 నుం చి 9 వరకు నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరా రు. హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో, నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో చెత్తాచెదా రం, పిచ్చిమొక్కలు, గడ్డిని తొలిగించి పరిసరాలు శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా రోజూవారీ కార్యక్రమాలను విధిగా నిర్వహించాలని కోరారు.
పరిసరాల పరిశుభ్రత అనేది ప్రతిఒక్కరి బాధ్యతగా గుర్తించాలని, తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తంగా చేయాలన్నారు. ప్రభు త్వ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, వైద్యశాలల ఆవరణలో విధిగా నిత్యం పారిశుధ్య పనులు చేపట్టాలని సం బంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించా రు. అందరి భాగస్వామ్యంతో వన మహోత్సవంలో భాగంగా ఖాళీ ప్రదేశాల్లో మొక్క లు నాటాలన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, వల్లపు రాజు, చిత్తారి పద్మ, పున్న సది, ముత్యాల సంజీవరెడ్డి, కైలునాయక్ పాల్గొన్నారు.