సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 13 : నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు జరుగనున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తెలంగాణ ఆడపడుచులకు మంత్రి హరీశ్‌రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నేడు ఎంగిలి పూలతో ప్రారంభమై తొమ్మిది రోజులపాటు తీరొక్క రంగులతో జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా జిల్లా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
తెంలగాణ సంస్కృతీ, సంప్రదాయాలు, ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని.. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ గొప్ప పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.