తొగుట, సెప్టెంబర్ 26 : వచ్చే ఎన్నికల్లో దుబ్బాకలో ఎగిరేది గులాబీ జెండేనని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండల కేం ద్రంలో 1070 మంది యువకులకు మంగళవారం లెర్నింగ్ లైసెన్స్‌లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రోడ్డు ప్రమాదాలకు గురైప్పుడు జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించడానికి ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. వాహనాలు కలిగిన యువకులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రతిఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేసిందన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో ఎమ్మెల్యే రఘనందర్‌రావు యువతకు మాయమాటలు చెప్పి మోసం చేశారన్నారు. ప్రజలు మోసపోతే గోస పడుతారని గుర్తుచేశారు. తెలంగాణ రాక ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, నేడు ఏ విధంగా పల్లెలు ఉన్నాయో గమనించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేయడంతో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేందుకు క్యూకడుతున్నారన్నారు.
తొగుటను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనోహరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, సొసైటీ చైర్మన్ హకికృష్ణారెడ్డి, వైస్ ఎం పీపీ శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కనకయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు కనుకయ్య, వైస్ చైర్మన్ రాంరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు కలీమొద్దీన్, సర్పంచ్‌లు ఎల్లం, నర్సింహులు, బీఆర్ఎస్ మం డల మాజీ అధ్యక్షులు కుంబాల శ్రీనివాస్, రాం రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు మాదాస్ అరుణ్‌కుమార్, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళా సాధికారతే సీఎం కేసీఆర్ లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం తొగుట మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన మండల మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో స్వయం సహాయక సంఘాలకు రూ.5లక్షల రుణా లు ఇచ్చేవారని, నేడు సీఎం కేసీఆర్ రూ. 20లక్షల వరకు రుణాలు అందిస్తున్నట్లు ఆయన గుర్తుచేశా రు. మహిళలకు స్వయం సంవృద్ధి సాధించడానికి మరింత సహకారాన్ని అందిస్తామన్నారు. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు.