పాపన్నపేట, సెప్టెంబర్ 11 : రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా పెద్దఎత్తున వర్షాలు పడడమే కాకుండా, సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎమ్మె ల్యే పద్మాదేవెందర్‌రెడ్డి సూచించారు. ఆదివారం ఏడుపాయల దుర్గాభవానీ మాతను ద ర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగామాతకు హారతి ఇచ్చి, చీరసారె సమర్పించారు. న దులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయని.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుం డా వనదుర్గా మాత కాపాడాలని అమ్మవారిని మొ క్కుకున్నట్లు తెలిపారు. వనదుర్గామాత ఆలయం ముం దు నుంచి ప్రవహిస్తున్న మంజీరా నదికి గంగాహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సింగూరు ప్రాజెక్టు నుంచి మూడు గేట్ల ద్వారా ఆదివారం 35000 క్యూ సెక్కుల నీటిని వదిలారన్నారు. నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున మంజీరా పరీవాహక ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు, పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏడుపాయల ఆలయానికి వచ్చే భక్తులు మంజీ రానది వైపు వెళ్లకుండా ఉండాలని సూచించారు. ఎమ్మె ల్యే వెంట ఆలయ పాలక మండలి చైర్మన్ బాలాగౌడ్, మాజీ చైర్మన్ విష్ణువర్ధ్దన్‌రెడ్డి, ఈవో శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, సర్పంచ్ సంజీవ్‌రెడ్డి, స్థానిక నాయకుడు శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తలు వెంకటేశం, భూషణం, యాదయ్య, పెంటయ్య, మనోహర్ ఉన్నారు.