చేగుంట, సెప్టెంబర్ 9 : గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభి వృద్ధి పనులను వెంటనే పూర్తి చేసి, మండలాభివృద్ధికి సహకరించాలని అధికారులను ఎంపీపీ మాసుల శ్రీనివాస్ కోరారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మా ణ పనుల త్వరితగతిగా పూర్తి చేయాన్నారు. చేగుంటలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ అధ్యక్షతన శుక్రవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు, చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని, గ్రామాల్లో అనుమతులు లేకుండా పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రతి గ్రామంలో క్రీడా మైదానాన్ని నిర్మించాలని ఎంపీడీవో ఆనంద్‌మేరీ సూచించా రు. మండలంలో మొత్తం 18759 ఎకరాల్లో పంటలు సాగు చేయగా, 13,718 మంది రైతులకు రూ.10కోట్ల రైతుబంధు నగదును ప్రభుత్వం జమ చేసిందని ఏవో హరిప్రసాద్ తెలిపారు. మండలంలో 31 రేషన్ దుకాణాలు ఉన్నాయని, వాటి ద్వారా ప్రతినెలా పేదలకు బియ్యం అందజేస్తున్నట్లు తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు సూచించారు. సమావేశంలో జడ్పీటీసీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ మున్నూర్ రామచంద్రం, జిల్లా పరిశ్రమల అధికారి జయంతితోపాటు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.