
వెల్దుర్తి, జనవరి 10: దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా సోమవారం మాసాయిపేటలో రైతుబంధు ర్యాలీ నిర్వహించారు. గ్రామచావిడి దగ్గర నుంచి మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, మహిళలు, ట్రాక్టర్లతో కలిసి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేశచరిత్రలోనే రూ.50 వేలకోట్లను రైతుల ఖాతాల్లో జమచేసిన చరిత్ర సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతు సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో ఉందన్నారు. రైతుబంధు పథకం అమలు నాటి నుండి రాష్ట్రంలో రైతులకు లాగోడి కష్టాలు తీరాయని తెలిపారు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని, అలాంటి గొప్ప వ్యక్తి మనకు ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర రైతుల అదృష్టమన్నారు. రైతుబంధు అమలు విజయవంతంగా కొనసాగుతుండడంతో గ్రామగ్రామానా రైతులతో కలిసి అన్ని వర్గాల ప్రజలు రైతుబంధు సంబురాలను ఘనంగా జరుపుకొంటున్నారని తెలిపారు. రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్టవేసి, రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధరతో సీఎం కేసీఆర్ రైతులకు ఆత్మస్తైర్యం కల్పించారని కొనియాడారు. ఇవేమీ పట్టించుకోకుండా బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, రైతుబంధు మండల కోఆర్డినేటర్ వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మాసాయిపేట సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, నాయకులు స్టేషన్ శ్రీను, నరేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, శ్రీనునాయక్, అచ్చంపేట శ్రీను, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.