శివ్వంపేట, జూన్ 1 : ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ పుట్టినరోజు వేడుకలు బుధవారం శివ్వంపేట మండలకేంద్రంలో అట్టహాసంగా జరిగాయి. టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎంపీపీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కేహెచ్ఆర్ ట్రస్టు చైర్మన్ కల్లూరి హనుమంతరావు ఆధ్వర్యంలో దివ్యా గార్డెన్లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంపీపీ హరికృష్ణ సేవా కార్యక్రమాలతో ప్రజల్లో మంచి గు ర్తింపు తెచ్చుకున్నారని, భవిష్యత్‌లో ఉన్నత పదవులు పొం దాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కేక్‌కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ముందుగా ఎంపీపీ హరికృష్ణ అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు. వేడుకల్లో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీకోఆప్షన్ సభ్యుడు మన్సూర్, హైకోర్టు న్యాయవాది శివకుమార్‌గౌడ్, వ్యాపారవేత్త మల్లారెడ్డి, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్కుల్ మహిపాల్‌రెడ్డి, మండలాధ్యక్షురాలు లావణ్యామాధవరెడ్డి, వైస్ ఎంపీపీ రమాకాంత్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ పాల్గొన్నారు.