మెదక్ మున్సిపాలిటీ, మే 24: మున్సిపాలిటీల్లో ఆన్లైన్ సేవలను విస్తరింప చేసి ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించేలా మున్సిపల్ శాఖ ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా పన్నులు నగదు రూపంలోనే కాకుండా డిజిటల్ చెల్లింపులు స్వీకరించేలా చర్య లు చేపట్టారు. ఈ నెల 14న ము న్సిపల్ శాఖమాత్యులు కేటీఆర్ హైదరాబాద్‌లో నిర్వహించిన పట్టణ ప్రగతి వర్క్‌షాప్‌లో సంబంధిత క్యూఆర్‌కోడ్ డిజిటల్ చెల్లింపుల పోస్టర్‌ను ఆవిష్కరించారు. మెదక్ ము న్సిపాలిటీలో సంబంధిత సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. త్వరలో నే క్యూఆర్‌కోడ్ అందుబాటులోకి తేనున్నారు. గతంలో ఆస్తిపన్ను ఇతర రకాల పన్నులను ఇంటిం టా సిబ్బంది తిరుగుతూ వసూలు చే సే వారు, ఆ తరువాత ఆన్లైన్లో కొన్నింటి కీ మాత్రమే అనుమతి ఉండేది. తాగునీటి నల్లాల పన్నులు డబ్బుల రూపంలోనే నేటికి చెల్లించేవారు. ప్రస్తుతం అన్ని రకాల సేవలు, పన్నులను ఆన్లైన్లో నమోదు చేసి క్యూఆర్ కోడ్, జీఐ క్యూఆర్ ద్వా రా వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నా రు.
మున్సిపల్ పరిధిలోని ఆస్తి పన్ను వివరాలు, చెల్లింపు, ఆస్తి పన్ను స్వీయమదింపు, వ్యాపార అనుమ తి, పునరుద్ధరణ, ప్రకటనల కోసం, ట్రేడ్ లైసెన్స్, భవనాలు, లేఅవుట్ అనుమతి, నల్లాల మంజూరు, పన్ను చెల్లింపు, ఫిర్యాదులు, పరిష్కారం, మొబైల్ టవర్ అనుమతి, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ తదితర సేవలు ఆన్లైన్లో అందనున్నాయి. ఈ సేవలను పిన్‌నంబర్ ఎంటర్ చేసి క్రెడిట్/డెబిట్ కార్డు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా చెల్లించేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ సేవలు అందెలా ప్రయాణ ప్రాంగణాలు, ప్రధాన చౌరస్తాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి సేవలందించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. క్యూఆర్ కోడ్ పూర్తి స్థాయిలో అం దుబాటులోకి వస్తే పన్నులు చెల్లింపుదారులకు సమయం వృ థా కాకుండా సకాలంలో చెల్లించే అవకాశం ఉంటుంది.
త్వరలో అందుబాటులోకి..
ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ ప్రజలకు మెరుగైన సేవ లు అందించేందుకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటున్నాం. చెల్లింపు దారులు క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేసి చెల్లించే అవకాశం ఉంటుంది. త్వరలోనే అందుబాటులోకి తేస్తాం.
– శ్రీహరి, మున్సిపల్ కమిషనర్