కొల్చారం, మే 24: నియోజకవర్గంలోని రూ. 138.50 కోట్లతో సీసీ రోడ్డు వేయించినట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని వసురాం తండాలో సేవాలాల్, జగదాంబ దేవాలయంలో విగ్రహప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై హోమంలో పాల్గొన్నారు. గిరిజన నేతలు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మింపజేస్తానని తెలిపారు. కొల్చా రం నుంచి వరిగుంతం వరకు రోడ్డు రీబీటింగ్ పను లకు నిధులు మంజూరైనట్లు, అలాగే అంసాన్పల్లి నుంచి కొల్చా రం వరకు నాలుగు కిలోమీటర్ల రోడ్డును రీబీటింగ్ చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ మోతి పాండు, ఉపసర్పంచ్ వినోద్‌నాయక్ పాల్గొన్నారు.
ఎల్వోసీ అందజేసి ఎమ్మెల్యే…
అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలికి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చికిత్స నిమిత్తం ఎల్వోసీని అందజేసి బాధితులకు అండగా నిలిచారు. మండలంలోని మన్నెవారి జలాల్పూర్ గ్రామానికి చెందిన గాయత్రీ అనారోగ్యానికి గురికావడంతో వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక తండ్రి తిమ్మయ్య తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయాన్ని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే వైద్య చికిత్స నిమిత్తం రూ.75వేల ఎల్వోసీని ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మం జూరు చేయించి, మంగళవారం తన నివాసంలో బాధితులకు అందజేశారు.