మెదక్ రూరల్, ఏప్రిల్ 30 : మానసిక, శారీరక, అదనపు కట్న వేధింపులు ఎదుర్కొంటున్న బాధిత మహిళలకు మేమున్నామంటూ సఖీ కేంద్రాలు భరోసా కల్పిస్తున్నాయని సఖీ కేంద్రం నిర్వాహకురాలు శాంత తెలి పారు. సఖీ ప్రచార రథం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచనలతో నెల రోజులపాటు జిల్లాలో 20 మండలాలు, 320 గ్రామాల్లో సఖీ కేంద్రంలో అందించే సేవలను వివరిం చారు. శనివారం మెదక్‌లోని గాం ధీనగర్, ఇంద్రపురి కాలనీలో సఖీ కేంద్రం సేవలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సంద ర్భంగా సఖీ కేంద్రం నిర్వహకురా లు మాట్లాడుతూ.. బాధితులకు తాత్కాలిక వసతితో పాటు ఉచిత న్యాయసహాయం, వైద్యసేవలు, పోలీస్ సహాయం, కౌన్సెలింగ్ ఇచ్చి మానసిక ధైర్యా న్ని సఖీ కేంద్రం కల్పిస్తుందన్నారు. ఆపద సమయా ల్లో సఖీ కేంద్రం నుంచి వాహనాన్ని పంపిస్తామని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే 0452-2951 81, 934614580 లేదా టోల్‌ఫ్రీ 181 నెంబర్లును సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సఖీ సెంటర్ సపోర్ట్ ఏజెన్సీ కైలాశ్, కేస్ వర్కర్ లావణ్య, పారామెడికల్ వర్కర్లు లక్ష్మి, కృష్ణ, నాగారాజు ఉన్నారు.