మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 30 : అధికారులు మహిళా అని చూడకుండా అవమానపరుస్తున్నారని కౌన్సిలర్ దొంతి లక్ష్మి ఆరోపించారు. ఈ మేరకు మున్సిపల్ సమావేశంలో నేలపై కూర్చోని నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం మెదక్ మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే 14వ వార్డు కౌన్సిలర్ లక్ష్మి.. మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారుల పై అసహనం వ్యక్తం చేస్తూ నేలపై కూర్చున్నారు. 14వ వార్డులో మం చినీటి అవసరాలకు పైపులు కావాలని మున్సిపల్ చైర్మన్, ఇంజినీరింగ్ అధికారులకు విజ్ఞప్తి చేసి, యేడాది గడుస్తున్నా ఇప్పటి వరకు పైపులు ఇవ్వలేదన్నారు. మహిళా కౌన్సిలర్ అయినందునే నన్ను అవమాపరుస్తున్నారని, ప్రజలకు సరైన న్యాయం చేయలేకపోతే కౌన్సిలర్‌గా నేనేందుకు.. అవరసమైతే రాజీనామా చేస్తానని పేర్కొన్నారు.
వార్డులోని మల్లన్న ఆలయం వరకు సీసీరోడ్డు పనులకు గతనెలలో రూ.లక్ష మంజూరు చేశారని, ఈ సమావేశంలో పట్టణ ప్రగతిలో రూ. లక్షన్నర నిధులు కావాలని ఎజెండాలో ఏలా? చేర్చు తారని ప్రశ్నించారు. నా వార్డులో పనులు చెప్పకుండా..నిధులు కావాలని ఎలా అడుగుతారని? మున్సిపల్ చైర్మన్‌ను ప్రశ్నించారు. ము న్సిపల్ చైర్మన్, మహిళా కౌన్సిలర్లు లక్ష్మి వద్ద కు వెళ్లి మీ స్థానంలో కూర్చుని మాట్లాడాలని కోరారు. గడుమన్పల్లి రోడ్డు నుంచి మల్లన్న ఆలయం వరకు రూ. లక్ష నిధులు సరిపోకపోవడంతోనే మరో రూ.లక్షన్నర నిధులపై ఎజెండాలో చేర్చామని చైర్మన్‌తోపాటు వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ వివరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎజెండా అంశాలను ఆమోదించారు.
మాజీ కౌన్సిలర్ జీవన్‌గౌడ్, మున్సిపల్ ఉద్యోగి అశోక్‌గౌడ్ మృతికి కౌన్సిల్ సంతాపం ప్రకటించింది. సమావేశ అనంతరం మృతుల ఇం టికి వెళ్లి చైర్మన్, కౌన్సిలర్లు కుటుంబ సభ్యులను పరామర్శించారు. సమావేశంలో కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, ఆంజనేయులు, కిశోర్, శ్రీనివాస్, లింగం, సుంకయ్య, సమియొద్ద్దీన్, లక్ష్మీనారాయణగౌడ్, వసంత్‌రాజ్, గాయత్రి, సులోచన, మమత, రుక్మిణి, మేఘమా ల, దేవరాజ్, అధికారులు చంద్రమోహన్, మహేశ్, సిద్ధేశ్వరి ఉన్నారు.