జహీరాబాద్, ఏప్రిల్ 18: దళితులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు రూ.10 లక్షలు ఉచితంగా ఇస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ఎప్పుడూ రుణపడి ఉండాలని అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మంత్రి హరీశ్‌రావు కృషి చేస్తున్నారన్నారు.
దళితుల ఆర్థికాభివృద్ధికి సీఎం కృషి
దళితులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
మా కుటుంబంలో వెలుగులు నింపిన దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. నేను ఒకరి వద్ద డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబ పోషణ చేసే వాడిని. దళితబంధు కింద పికప్ వ్యాన్ కొనుకున్నా. ఇప్పుడు ఓ వాహనానికి యజమానిని అయ్యాను. ఇక ఆర్థికంగా ముందుకెళ్తాను.
– సతీశ్, దళితబంధు లబ్ధిదారుడు, గోటిగార్పల్లి
ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తాం..
నిరుపేదలమైన మాకు దళితబంధు పథకంలో ఎంపిక చేసిన్రు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో ట్రాక్టర్ కొనుగోలు చేశాం. ఇప్పుటివరకు చాలీచాలని వేతనంతో డ్రైవర్‌గా పని చేశా. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళిత బంధుతో ట్రాక్టర్ కొనుక్కున్న. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మా జీవితల్లో వెలుగులు నింపిన దేవుడు సీఎం కేసీఆర్.
– దండు అశోక్, దళితబంధు లబ్ధిదారుడు, గోటిగార్పల్లి
ఎప్పుడూ రుణపడి ఉంటారు..
సీఎం కేసీఆర్‌కు గోటిగార్పల్లి దళితులు ఎప్పుడూ రుణపడి ఉంటారు. దళితబంధు పథకంలో ప్రతి ఇంటికీ లబ్ధిచేరింది. దీంతో ఆర్థికంగా అభివృద్ధి సాధి స్తాం. మంచిగా పని చేసి బాగుపడుతం. మా కుటుంబాలను మంచిగా సాదుకుంటం.
– తిమోతి, దళితబంధు లబ్ధిదారుడు, గోటిగార్పల్లి
సీఎం సారు మేలు మరువం..
నాకు పికప్ వ్యాన్ మంజూరైంది. నేనూ ఊర్లో నే ఉండి వ్యవసాయం చేసుకుంటా. గూడ్స్ వాహనంలో వస్తువులు రవాణా చేసుకుని ఉపాధి పొం దుతా. దళితబంధు పథకాన్ని తప్పుకుండా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తా. నా కల నెరవేరింది. సీఎం కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం.
– అల్లీపూరం మొగులయ్య, దళితబంధు లబ్ధిదారుడు, గోటిగార్పల్లి