మద్దూరు (ధూళిమిట్ట), ఏప్రిల్ 16 : మనం ఏదో పనిమీద బయటికి వెళ్తుంటాం. రోడ్డు మీద ఓ ప్రమాదం జరిగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటారు. ఆ సమయంలో మన మొబైల్ నుంచి ‘108’కి ఫోన్‌చేసి సమాచారం అం దిస్తాం. ఒక్క కాల్‌తో రెండు ప్రాణాలు కాపాడిన వాళ్లమవుతాం. పైగా ఫోన్ చేయడంతో ఒక్క పైసా ఖర్చుండదు. ఇలాంటి టోల్ ఫ్రీ నంబర్లు ఇప్పుడు అన్ని రంగాలకు విస్తరించాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా అందిస్తున్నాయి. విపత్కర సమయాలు, ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వం కొన్ని ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లను ప్రజలకు అందుబాటులోకి తెస్తుంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. అలాంటి టోల్ ఫ్రీ నంబర్ల గురుంచి తెలుసుకుందాం. అలాగే మరికొన్ని ముఖ్యమైన నంబర్లు మీకోసం అందిస్తున్నాం.
102, 108
ఎక్కడైనా, ఎవరైనా ఆకస్మికంగా ప్రమాదానికి గురైన, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతుంటే వారిని అత్యవసర చికిత్స నిమిత్తం దవాఖానలో చేర్పించాలంటే అంబులెన్స్ కోసం ఈ నెంబర్‌కు కాల్ చేయాలి.
1091:
మీకు ఎక్కడైనా ఈవ్‌టీజింగ్ దృ శ్యాలు కనిపించాయా.. వరకట్నం కారణంగా ఇబ్బందులు పడుతున్నారా. ఇలాం టి వాటితో పాటు అత్తమామల హింస, ఆకతాయిల ఆగడాలను గురించి సమాచారాన్ని అందించేందుకు ఈ నెంబర్‌కు కాల్ చేయాలి.
1100:
మీ-సేవ కేంద్రాలు సరిగా పనిచేయడం లేదా దరఖాస్తు చేసుకున్న ధ్రువపత్రాలను నిర్ణీత సమయంలోగా ఇవ్వడం వంటి తదితర అంశాలపై ఫిర్యాదు చేసేందుకు ఈ నెంబర్‌కు కాల్ చేయాలి.
14567
దివ్యాంగులు, వయోజనుల సమస్యల కోసం ఈ నెంబర్‌కు కాల్ చేయాలి.
1098
6 నుంచి 14 ఏండ్ల వయస్సులోపు పిల్లలపై వేధింపులు జరుగుతున్నాయా, ఎక్కడైనా తప్పిపోయారా వంటి వాటిపై సమాచారం ఇచ్చేందుకు ఈ నెంబర్‌కు కాల్ చేయాలి.
1910
అందుబాటులో ఉన్న గ్రూపు రక్తం, ఇతర వివరాలను ఈ నెంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
1500:
బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్లకు సంబంధించిన సమాచారం కోసం ఈ నెంబర్‌కు కాల్ చేయాలి.
1064:
ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం అధికారులు ఎవరైనా లంచం అడిగితే ఈ నెంబర్‌కు కాల్ చేయాలి. ఏసీబీ అధికారులు స్పందిస్తారు. ఏసీబీ మెదక్ రేంజ్ నంబర్లు 08455-276522, 9440446149
131:
రైల్వే రిజర్వేషన్, రైళ్ల రాకపోకల వివరాలు ఈ నెంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
1950
ఓటరు నమోదు, తొలిగింపులు, పేరు మార్పిడి, ఓటు మార్పిడి, అవసరమైన సర్టిఫికెట్లు వంటి వివరాలు తెలుసుకోవచ్చు.
1800-180-5232
తపాలా బీమాలో చేరాలనుకుంటే వివిధ వివరాల కోసం ఈ నెంబర్‌కు కాల్ చేయాలి.
133355
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు అన్యాయం జరుగుతోందా, కూలీ డబ్బులు ఇవ్వడం లేదా అయితే ఈ నెంబర్‌కు కాల్ చేయాలి.
155321
ప్రభుత్వ కార్యాలయాలకు మీరు వెళ్లినప్పుడు అక్కడ మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారా అయితే ఈ నెంబర్‌కు కాల్ చేయాలి.
18004255314:
స్త్రీ,శిశు అభివృద్ధి సంస్థలో సిబ్బంది పనితీరు, పిల్లలకు ఆహార సరఫరాలో లోపాలుంటే ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
040-30102829, 040-68153333 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ)కి సంబంధించి సేవలు, ఇతర సమాచారం కోసం ఈ నెంబర్‌కు కాల్ చేయాలి.
155260 (సైబర్ క్రైం నేషనల్ హెల్ప్‌లైన్ నంబర్ ):
ఎవరైనా సైబర్ నేరాల బారినపడినప్పుడు ఈ నంబర్‌కు వెంటనే ఫోన్‌చేయాలి. వీళ్లు మీకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తారు. 24 గంటల్లో మీఖాతా ఫ్రీజ్ చేసి, మీ డబ్బులు సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టగుండా చర్యలు చేపడతారు.
1090: నేరాలు నియంత్రించడానికి..
1073 : ట్రాఫిక్ హెల్ప్‌లైన్
040-23538846, 040-24600146 ఉస్మానియా జనరల్ దవాఖాన (హైదరాబాద్)
040-27505566 గాంధీ దవాఖాన (సికింద్రాబాద్)
040-23814421/22/23/24 ప్రభుత్వ చాతి దవాఖాన (ఎర్రగడ్డ)
040-24740245/24742329 ప్రభుత్వ ఈఎన్టీ దవాఖాన (కోఠి)
181 : ఉమెన్స్ హెల్ప్‌లైన్
040-24745243: బ్లడ్‌బ్యాంకు
131/135: రైల్వే ఎంక్వైరీ
1912 : విద్యుత్ ఫిర్యాదులు
1098 : పిల్లలపై నేరాలు అరికట్టడానికి..