మెదక్ రూరల్, ఏప్రిల్ 14 : వాహనదారులూ ట్రాఫిక్ చలాన్లు ఇంకా చెల్లించలేదా? ఈ ఒక్క రోజే గడువు ఉన్నది. పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం భారీ రాయితీ ఇచ్చింది. ఈ గడువు శుక్రవారంతో ముగియనున్నది . వాహనదారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు పెండింగ్ చలాన్లపై భారీగా ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసేందే. ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేస్తుకోవాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. గడువు తీరిన తర్వాత చలాన్ పెండింగ్ ఉంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
చలాన్లపై ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును వాహనదా రులందరూ వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ద్వి చక్ర వాహనాలు, త్రి చక్ర వాహనాలు, లారీలు, నాలుగు చక్రాల వివిధ రకాల వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్ల ను శుక్రవారంలోగా చెల్లించాలని పేర్కొన్నారు. టూ వీలర్, త్రీ వీలర్ చలాన్లపై 75 శాతం రాయితీ పోగా, 25 శాతం మాత్రమే చెల్లించాలన్నారు. బస్సులపై 70 శాతం రాయితీ పోనూ 30 శాతం చెల్లించాలన్నారు. ఫోర్ వీలర్, భారీ వాహనదారులు 50శాతం జరిమానా మాత్రమే చెల్లించాలి.
ట్రాఫిక్ చలాన్లు చెల్లింపులు ఇలా..
మీ సేవ కేంద్రాలు, స్మార్ట్ పోన్ ద్వారా లేదా ఆన్లైన్లో echallan. tspolice.gov.in వైబ్సైట్లో ట్రాఫిక్ చలా న్లను చెల్లించవచ్చు. వెబ్సైట్లో వాహన నంబర్ నమోదు చేయగానే పెండింగ్ ట్రాఫిక్ చల్లాన్లు కనిపిస్తాయి. పెండింగ్ చలాన్ల సంఖ్య మొత్తం జరిమానాతోపాటు రాయితీపోగా చెల్లించాల్సిన జరిమానా కనిపిస్తుంది. ఎస్బీఐ, ఆన్లైన్, ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, ఇతర బ్యాంకుల డిజిటల్ వ్యాలెట్లతో పెండిం గ్ ట్రాఫిక్ చలాన్లను చెల్లించవచ్చు.
రాయితీని సద్వినియోగం చేసుకోవాలి
పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించడానికి ప్రభు త్వం కల్పించిన రాయితీని వా హనదారులు సద్వినియోగం చేసుకోవాలి. శుక్రవారం చివరి గడువని, ప్రతి వాహనదారు డు తమ వాహనంపై ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించాలి. గడువు దాటిన తర్వాత వాహనాల తనిఖీ నిర్వహిస్తామన్నారు. తనిఖీల్లో చలా న్లు చెల్లించకుంటే దొరికితే చర్యలు తీసుకుంటాం. వా హనదారులందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలి. – విజయ్, మెదక్ రూరల్ సీఐ