
తూప్రాన్ రూరల్, జూన్ 29: హరిత తెలంగాణగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ సంకల్పమని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరుప్రతాప్రెడ్డి అన్నారు. జూలై 1 నుంచి 10 రోజుల పాటు నిర్వహించనున్న పట్ట ణ, పల్లెప్రగతిలో 7వ విడత హరితహారాన్ని విజయవంతం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తూ ప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం చైర్మన్ రాఘవేందర్‌గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్‌తో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 6 విడుత ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 218 కోట్ల మొక్కలను నాటి సంరక్షించామన్నారు. నగరంలోని బోయిన్పల్లి నుంచి నిజామాబాద్ వరకు జాతీయ రహదారి పొడవునా హరితహారం మొక్కలను నాటి సంరక్షించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. పట్టణాల్లో వార్డులు, కాలనీల్లో మొక్కలను నాటి సంరక్షించే బాధ్యతను కౌన్సిలర్లు తీసుకోవాలన్నారు.
65 వేల మొక్కల పెంపకానికి సిద్ధం
ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి
తూప్రాన్ పట్టణంలోని 16 వార్డుల్లో 65 వేల మొక్కల పెంపకానికి సిద్ధంగా ఉన్నాయని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఈ సమా వేశంలో మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్‌గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్,టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, కౌన్సిలర్లు శ్రీశైలంగౌడ్, కుమ్మరి రఘుపతి, మామిండ్ల కృృష్ణ, తలారి మల్లేశ్, ఉమాసత్యలింగం, వెంకట్‌గౌడ్, టీఆర్ ఎస్ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, అజర్, ప్రభాకర్‌రెడ్డి, సత్తార్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
మొక్కల పెంపకంపై దృష్టి సారించాలి
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను సంరక్షించే బాధ్యత ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, కార్యదర్శులదేనని తూప్రాన్ ఎంపీడీ వో అరుంధతి అన్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ..ప్రజల సహకారంతో 7వ విడుత హరితహారం, 4వ విడత పల్లెప్రగతి కార్యక్రమాలను విజయవం తం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎం పీవో రమేశ్, ఈజీఎస్ ఏపీవో సంతోష్‌రెడ్డి, ప్రజాప్రతినిధలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
పల్లెప్రగతికి సిద్ధం కావాలి
మనోహరాబాద్, జూన్ 29 : జూలై మొదటి వారం నిర్వహించబోయే పల్లెప్రగతి కార్యక్రమానికి సిద్ధం కావాలని డీపీవో తరుణ్‌కుమార్ తెలిపారు.శివ్వంపేటఎంపీడీవో కార్యాలయంలో ఎం పీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ, ఎంపీడీవో నవీన్‌కుమార్‌లతో కలిసి సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గ్రామాలను పట్టణాలను తలదన్నే విధంగా తయారు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పల్లె ప్రగతి నిర్వహిస్తుందన్నారు. ప్రతి పంచాయతీ పాలకవర్గం పల్లె ప్రగతిపై ప్రజలకు, మహిళలకు అవగాహన కల్పించాలన్నారు.గతంలోఎన్ని మొ క్కలను నాటాము. ప్రస్తుతం ఎన్ని మొక్కలను నాటుతున్నామో వాటి వివరాలను రికార్డులో పొందుపర్చాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
చేగుంటలో…
చేగుంట, జూన్ 29: ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేగుంట ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ శ్రీనివాస్ అన్నారు. చేగుంటలోని రైతు వేదికలో నిర్వహించిన పల్లె ప్రగతి సమావేశం లో వారు మాట్లాడు తూ పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కో రారు. కార్యక్రమంలో మ ండల ప్రత్యే క అధికారి జయరాజ్, ఎంపీడీవో ఉమాదేవి, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎం పీవో ప్రశాంత్‌తో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గ్రామాల్లో ఉన్న విద్యుత్ సమస్యలపై సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని నార్సింగి మండల ప్రత్యేక అధికారి జగదీశ్ పేర్కొన్నారు. నార్సింగిలో ఎంపీపీ సబిత అధ్యక్షతన ప్రత్యేక అధికారి నాల్గోవిడుత పల్లెప్రగతి సమావేశంలో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు.
చిలిపిచెడ్..
చిలిపిచెడ్, జూన్ 29: పల్లెప్రగతి విజయవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి దేవయ్య గ్రామ కార్యదర్శులను అదేశించారు. చిలిపిచెడ్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు గ్రామ కార్యదర్శితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మాట్లాడుతూ జూలై 1 నుంచి 10 వరకు నిర్వహించే పల్లెప్రగతి కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో ఎంపీపీ వినోద దుర్గారెడ్డి, ఎంపీడీవో శశిప్రభ, ఏపీవో శ్యామ్‌కుమార్, ఎంపీవో పోలేశ్వర్రాజు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు లక్ష్మీదుర్గారెడ్డి, ఎంపీటీసీ ఫో రం మండల అధ్యక్షుడు సుభాశ్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
రామాయంపేట…
రామాయంపేట, జూన్ 29: పల్లె ప్రగతి నాల్గో విడత కార్యక్రమాలను గ్రామంలోని సర్పంచ్‌లు, కార్యదర్శులు,ఎంపీటీసీలు విజయవంతం చే యాలని రామాయంపేట ప్రత్యేక అధికారి శ్రీనివాస్‌రావు, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, ఎంపీపీ నార్సింపేట భిక్షపతి అన్నారు. రామాయంపేట ఎంపీపీ కార్యాలయంలో మండల సర్పంచ్, కార్యదర్శులు, ఎంపీటీసీలతో ప్రత్యేక సమావేశం ఏర్పా టు చేసి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు ఎంపీవో గిరిజారాణి పాల్గొన్నారు.
పల్లెప్రగతి,హరితహారంపై సమీక్ష సమావేశం
నిజాంపేట,జూన్29: మండల ప్రజాపరిషత్ కా ర్యాలయంలో మండల ప్రజాప్రతినిధులు, కా ర్యదర్శులతో మండల ప్రత్యేకాధికారి విజయలక్ష్మి పల్లెప్రగతి, హరితహారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ జూలై 1 నుంచి ప్రారంభం కానున్న పల్లెప్రగ తి, హరితహారం కార్యక్రమాల గురించి సమావేశంలోచర్చించామన్నారు. కార్యక్రమంలో ఎంపీ పీ సిద్ధిరాములు, జడ్పీటీసీ విజయ్‌కుమార్, ఎం పీవో రాజేందర్, మండల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్ ఉన్నారు
గ్రామాల అభివృద్ధికి పల్లెప్రగతి
వెల్దుర్తి, జూన్ 29. గ్రామాల అభివృద్ధికి పల్లెప్రగతి కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని వెల్దుర్తి మండల ప్రత్యేక అధికారి, డీఆర్డీఏ ఏపీడీ స్వప్న అన్నారు. వెల్దుర్తిలో మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు పల్లెప్రగతి నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎంపీపీ స్వరూపానరేందర్రెడ్డి, జడ్పీటీసీ రమేశ్గౌడ్లతో కలిసి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నాల్గో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని వచ్చే నెల జూలై 1 నుంచి 10 వరకు కార్యక్రమా న్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జగదీశ్వరాచారి, ఎంపీవో తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్‌గౌడ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.