మెదక్ రూరల్, ఏప్రిల్ 8 : మెదక్ మండలంలోని మాచవరం గ్రామంలో కోదండ రామాలయం శ్రీరామ నవమి వేడుకలకు ముస్తాబైంది. శ్రీరామనవమి ఉత్సవాలను రెండు రోజు లపాటు నిర్వహిస్తారు. శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు ప్రజ లు, భక్తులు భారీగా తరలివస్తారు. ఆదివారం ఉదయం స్వా మివారిని ఊరేగిస్తారు. ఆలయ ప్రాంగణంలో మధ్నాహాం 12 గంటలకు సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు.
రామాయంపేట ఉత్సవాలకు రానున్న ఎమ్మెల్యే
సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామాయంపేటతోపాటు రాయిలాపూర్, కాట్రియాల, లక్ష్మాపూర్, కోనాపూర్ తదితర గ్రామాల్లో ని ఆలయాలు కల్యాణానికి ముస్తాబయ్యాయి. నేటినుంచి 11వ తేదీ వరకు రామాలయాల్లో పూజా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయాల వద్ద అన్నదానానికి బియ్యం, వంటసామగ్రి సేకరిస్తున్నారు. 10న రామాయంపేటలో జరిగే వేడుకలకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఎమ్మెల్యే, చైర్‌పర్సన్‌కు ఆహ్వానం..
మండలంలోని రాందాస్‌గూడలో ఆదివారం సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ అంకం యాదగిరి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డిని కలిసి సీతారాముల కల్యాణ ఉత్స వాలకు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆయన వెంట నాయకులు మధుసూదన్, బాబూరావు, రాజు ఉన్నారు.