హవేళీఘనపూర్, మార్చి 27: తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కూచన్‌పల్లి వ్యవసాయ క్షేత్రంలో నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించి ఆదుకుంటున్న మహనీయుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. అనారోగ్యానికి గురై వైద్య చేయించుకోలేని స్థితిలో ఉన్న వారు దరఖాస్తు చేసుకుంటే ఆర్థిక సాయం అందజేస్తున్నారని అన్నారు. పేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలు పెట్టారన్నారు. వేసవిలోనూ కాళేశ్వరం నీటితో జిల్లాలు కళకళలాడుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్, సర్పంచ్‌లు మహిపాల్‌రెడ్డి, యామిరెడ్డి, దేవాగౌడ్, లక్ష్మీనారాయణ, ఎంపీటీసీలు సిద్దిరెడ్డి, శ్రీనివాస్, స్వామినాయక్, శ్రీనునాయక్, ప్రశాంత్ పాల్గొన్నారు.