ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
మినీ డెయిరీ షెడ్డుల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
వట్పల్లి, మార్చి 25: దళిత కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.10 లక్షలు ఇవ్వడం సాధ్యపడదని దళిత బం ధుపై అపనమ్మకం సృష్టించిన ప్రతిపక్షాలకు చెంపదెబ్బ అవుతుందని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మండలంలోని బుడ్డాయిపల్లి గ్రామంలో దళిత బంధు లబ్ధిదారులకు మినీ డెయిరీ షెడ్డుల పనులను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. నిధుల మంజూ రు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే దళితులకు అండగా ప్రభు త్వం నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ అందించిన దళిత బంధుతో దళిత కుటుంబాల భవిష్యత్తుకు బంగారు బాటా వేసుకోవాలని సూచించారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెంది, సామాజిక అసమానతలు తగ్గించిడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహత్తర పథకం దళిత బంధు అని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో విక్టర్, ఎంపీపీ కృష్ణవేణి, ఏపీడీవో యూసుఫ్, సర్పంచ్ పద్మారావు, ఎంపీటీసీ నవీనా సదానదం, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, రైతుబంధు అధ్యక్షుడు అశోక్ గౌడ్, వరం అధ్యక్షుడు వీరారెడ్డి, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
రెండో విడత గొర్రెల పంపిణీ
రేగోడ్, మార్చి 25: మండలంలోని గజ్వాడ గ్రామంలో స్థానిక ఎమ్యెల్యే చంటి క్రాంతికిరణ్ శుక్రవారం రెండో విడత గొర్రెలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఎమ్యె ల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో గొర్రెల పంపిణీ గొల్ల, కుర్మలకు అండగా నిలిచిందన్నారు. ముదిరాజులకు చేపల పంపిణీ, దళితుల కు దళిత బంధు ప్రవేశ పెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్దక శాఖ అధికారి విజ య శేఖర్‌రెడ్డి, మండల ప శు వైద్య శాఖ అధికారి ధర్మ చందర్, మండల రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుడు రాజేందర్ పాటిల్, ఎంపీపీ సరోజన, మాజీ వైస్ ఎంపీపీ రాము లు, ఎంపీటీసీ నర్సింహు లు, సర్పంచ్‌లు అనిత మా ణెప్ప, నర్సింహులు, జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు రమేశ్, నాయకులు కిషన్‌రెడ్డి, పండల్ రెడ్డి, వినోద్, నరేందర్, సంతోష్, రఘునాథ్ పాల్గొన్నారు.