జిల్లా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా అధ్యక్షుడు పర్స శ్రీనివాస్
రామాయంపేట, మార్చి 15: సీఎం కేసీఆర్కు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల ఫీల్డ్ అసిస్టెంట్లు జీవితకాలం రుణపడి ఉంటారని ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు పర్సశ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కడార్ల శ్రీశైలంయాదవ్, కోషాధికారి నర్సింహులు పేర్కొన్నారు. మంగళవారం రామాయంపేటలో విలేకరులతో వారు మా ట్లాడుతూ సీఎం కేసీఆర్ తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. కొన్ని రోజులుగా చేతిలో పనిలేక తీవ్ర ఇబ్బం దులకు గురయ్యామని ప్రస్తుతం సీఎం అసెంబ్లీలో చేసిన ప్రకటన తమకు సంతోషానిచ్చిందన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర ఎమ్మెల్యేల కోరిక మేరకు తమను విధుల్లోకి తీసుకుంటామని పేర్కొనడం మంచి పరిణామమన్నారు.
సెర్ప్ ఉద్యోగుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్
కొల్చారం, మార్చి 15 : సెర్ప్ ఉద్యోగుల పాలిట సీఎం కేసీఆర్ దేవుడు అని కొల్చారం ఐకేపీ ఏపీఎం అన్నారు. శాసనసభలో సీఎం కేసీఆర్ సెర్ఫ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే కొల్చారం ఐకేపీ కార్యాలయం వద్ద సెర్ఫ్ ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సీసీ వెంకటేశం, సబిత, విజయ, యాదగిరి పాల్గొన్నారు.
సీఎం నిర్ణయంపై హర్షం..
వెల్దుర్తి, మార్చి 15 : ఉపాధిహామీ పథకంలో ఎన్నో ఏండ్లుగా విధులు నిర్వహించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై వెల్దుర్తి మండల ఎఫ్ఏల సంఘం నాయకులు రాజాగౌడ్, నవీ న్, రాములు, శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
అల్లాదుర్గం, మార్చి 15 : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సెర్ఫ్ ఉద్యోగులకు వేతనాలను ఇస్తామని ప్రకటించ డం సంతోషకరమైన విషయమని ఏపీఎం నాగరాజు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు సెర్ఫ్ ఉద్యోగులకు సైతం ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా వేతనాన్ని ప్రకటించడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది. దీంతో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సీసీలు బేతయ్య, సతీశ్, బాబూరావు ఉన్నారు.