జోరుగా మెదక్, సిద్దిపేట, ఎల్కతుర్తి రోడ్డు సర్వే
మెదక్ నుంచి సిద్దిపేట వరకు 70కిలోమీటర్లు
సిద్దిపేట, ఎల్కతుర్తి వరకు 100 ఫీట్ల రోడ్డు
త్వరలోనే మొదలు కానున్న ఆర్అండ్బీ రోడ్డు పనులు
రామాయంపేట, ఫిబ్రవరి 27: మెదక్-సిద్దిపేట, ఎల్కతుర్తి రోడ్డు సర్వే పనులు జోరందుకున్నాయి. మెదక్ జిల్లా కేంద్రం నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రం వరకు 70 కిలోమీటర్ల రహదారికి ప్రభుత్వం రూ.800 కోట్లు మంజూరు చేసి సర్వే పనులను ముమ్మరం చేసింది. దాదాపు 80శాతం వరకు సర్వే పనులు పూర్తిచేసినట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. మెదక్ జిల్లా కేంద్రం నుంచి సిద్దిపేట జిల్లా వరకు రెండు బైపాస్‌లు రామాయంపేట మున్సిపల్, మండలంలోని అక్కన్నపేట గ్రామాల శివారులో పంట పొలాల నుంచి వంద ఫీట్ల రోడ్డుకు సర్వే పనులు చేపడుతున్నారు. రోడ్డు కారణంగా ఎక్కువశాతం ప్రభుత్వ భూమితో పాటు అక్కడక్కడ రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములు, ఇండ్లు పోతాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన ధర ప్రకారం వారికి డబ్బులు ఇవ్వడం జరుగుతుందని సంబంధిత అధికారులు అంచనా వేశారు. మెదక్ నుంచి సిద్దిపేట వరకు సుమారు పది బ్రిడ్జీల నిర్మాణాలు జరుగనున్నట్లు తెలిసింది. మెదక్ నుంచి సిద్దిపేట వరకు గతంలోనే మెదక్ డీఎఫ్‌వో రవిప్రసాద్ నేతృత్వంలో రోడ్డు కొలతలు నిర్వహించి హద్దులు ఏర్పాటు చేశారు.
విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి..
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నోబెల్ అవార్డు గ్రహిత సర్ సీవీ రామన్ స్ఫూర్తితో స్థానిక సమస్యలపై పరిష్కారం చూపి భావి శాస్త్రవేత్తలుగా ఎదుగాలి. గతంలో కన్నా ఇప్పుడు చాలా పాఠశాలల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సైన్స్ ల్యాబ్‌లు బలోపేతమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మనబడిలో ఎంపికైన అన్ని పాఠశాల్లో నాణ్యమైన సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటు చేస్తున్నందున విద్యార్థులు, ఉపాధ్యాయల సహకారంతో సమర్థవంతంగా వినియోగించుకోవాలి.
– రాజిరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి