సంగారెడ్డి, అక్టోబరు 25 : పిల్లలకు మెరుగైన విద్య అం దించడం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తున్నారు. పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల తీరు మాత్రం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరిగిన సంఘటన మరువకముందే జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని ‘కరుణ హై స్కూల్’లో దారుణం జరిగింది. బోధన చేసే ఉపాధ్యాయు డే పాఠశాలలో చదువుతున్న ఓ బాలికపై కన్నేశాడు. అంతటి తో ఆగకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ సంఘట న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే సంగా రెడ్డి పట్టణంలోని ‘కరుణ హైస్కూల్’ (ప్రైవేటు పాఠశాల)లో పని చేస్తున్న కృపానెల్సన్ అనే ఉపాధ్యాయుడు బాలికను లైం గిక వేధింపులకు గురి చేసిన విషయం బయటపడింది. విద్యాబుద్ధ్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారితే విద్యార్థినుల పరిస్థితి ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో జరిగిన సంఘటన బయట పొ క్కకుండా పాఠశాల యాజమాన్యం జాగ్రత్తపడి వెం టనే స్థాని క పోలీసులతో కుమ్మక్కైనట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ విష యం పట్టణమంతా మూడు రోజుల తరువాత బయటికి రావడంతో పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు. పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితున్ని అరె స్టు చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
నేర చరిత్ర కలిగిన ఉపాధ్యాయుడు
ఏడాదిన్నర క్రితం సదాశివపేట పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సమయం లో ఇలాగే విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడి తే విద్యార్థినీ తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. అంతేకాకుండా పట్టణ పరిసరాలలో విధులు నిర్వహిస్తే సహించమని పాఠశాల యాజమాన్యానికి సూచించడంతో సంగారెడ్డిలోని కరు ణ పాఠశాలలో విధుల్లో చేరినట్లు తెలిసింది. అప్పటి నుంచి విద్యార్థినులను లొంగదీసుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని బయట చెబితే నీకే నష్టం అని బెదిరింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేశాడు. విద్యార్థిని పరీక్షలు రాయలేని విధంగా వేధింపులు చేయడం తో ఇంటి వద్దనే ఉండటంతో తల్లిదండ్రు లు అడిగితే విషయం బయటికి వచ్చింది. అప్రమత్తమైన బాలిక తల్లిదండ్రులు నిం ధితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం తో అసలు విషయం బయటికొచ్చింది. పాఠశాలలో జరిగిన సంఘటనపై ప్రిన్సిపాల్‌ను సంప్రదించేందుకు వెళ్లగా అందుబాటులో లేద ని, అదనపు ప్రిన్సిపాల్‌ను వివరాలు అడుగగా నాకేం తెలియదని సమాధానం ఇచ్చింది. ఈ విషయంపై స్థానిక పట్టణ పోలీసులను సంప్రదించగా విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించామని పట్టణ ఇన్స్పెక్టర్ వివరించారు.
విద్యార్థి సంఘాల నిరసన
లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినికి అండగా నిలుస్తూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు, కార్యకర్తలు పాఠశా ల ఎదుట నిరసనకు దిగారు. శనివారం పట్టణంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట రహదారిపై విద్యార్థి సంఘా ల నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భం గా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లా విద్యాధికారి జిల్లా కేంద్రంలో ఉన్న కూడా ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్న సంఘటనలపై స్పందనలేదని అగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ జరిపి పాఠశాల అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.