గుమ్మడిదల, సెప్టెంబర్ 17: భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాందేవ్‌బాబా సారధ్యంలో భారతదేశంలో ప్రా చీనకాల ఆరోగ్య వ్యవస్థను, యోగా, యజ్ఞం, ఆయుర్వేదం, స్వదేశీ విద్య, వైద్యాన్ని తిరిగి తీసుకురావడానికి ఉచిత యో గా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు భారత్‌స్వాభిమాన్ జాతీయ ముఖ్య ప్రభారి స్వామి పరమాత్మార్ధదేవ్ తెలిపారు. శనివారం మండలంలోని అన్నారం ప్రకృతి నివాస్‌లో ఏడు జిల్లాల శిక్షకులతో యోగా శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథులుగా భారత్‌స్వాభిమాన్ జాతీయ ముఖ్య ప్రభారి స్వామి పరమాత్మార్ధదేవ్, రాష్ట్ర స్వాభిమాన్ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీధర్‌రావు, జాతీయ స్వాభిమాన్, పతంజలి ఆచార్య చంద్రమోహన్, యువభారత్, కేంద్రీయ ప్రభారి సచిన్, శివుడు, శివకుమార్, గోపాల్ కృష్ణ, రాష్ట్ర ఆర్గనైజర్ నందన్కృపాకర్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్ జిల్లాల యోగా శిక్షకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ జిల్లాల శిక్షకులకు భారతదేశంలోని ప్రాచీన ఆరోగ్య వ్యవస్థ, యోగా, ఆయుర్వేదిక్, భారత విద్య, వైద్యం విశిష్టతపై అవగాహన కలిగించారు. రెండు రోజులుగా యోగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజు వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండో రోజు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని అన్నారం ప్రకృతి నివాస్‌లో యో గా శిక్షణ తరగతులను నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత్ స్వాభిమాన్ జాతీయ ముఖ్య ప్రభారి స్వామి పరమాత్మార్ధదేవ్ మాట్లాడుతూ పతంజ లి యోగ్పిఠ్ సంస్థ, భారత్ స్వాభిమాన్ వ్యవస్థాపకులు రాందేవ్‌బాబా ఆలోచనలను విస్తృతం చేయడానికి జిల్లాలో యోగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో సనాతన ధర్మాన్ని, పురాతన వ్యవస్థను తీసుకరావడానికి కృషి చేస్తున్నామన్నారు. భవిష్యత్ తరాలకు భారత ప్రాచీన వ్యవస్థను తెలియజేయడానికి భారత్‌స్వాభిమాన్ సమితి, పతంజలి ఆధ్వర్యం లో నేటి తరానికి అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు. దీని కి యువభారత్, మహిళా పతంజలి సమితి ఆధ్వర్యంలో జాగృతం చేస్తున్నామన్నారు. ప్రపంచదేశాలను వణికించిన కరోనా వైరస్‌ను యోగా ద్వారా సంపూ ర్ణ ఆరోగ్యవంతులుగా చేయడానికి విశేషంగా కృషి చేసినట్లు తెలిపారు. ఆన్లైన్ తరగతుల ద్వారా 40లక్షల మందికి యోగాపై అవగాహన కలిగించామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయాలని సూచించారు. జిల్లాలు, మండలాలుగా ఎంపిక చేసి ఉచిత యోగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడు జిల్లాల యోగా శిక్షణ గురువులు, మూడు వందల మంది శిక్షణ పొందిన వారు పాల్గొన్నారు.