మనోహరాబాద్, మే 26 : నిరుపేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నంబర్‌వన్ సీఎంగా కేసీఆర్ నిలిచారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం రామాయిపల్లి, కోనాయిపల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇండ్లను శుక్రవారం మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇండ్లను ‘గడా’ ముత్యంరెడ్డి, ఆర్డీవో శ్యాంప్రకాశ్లతో కలిసి గురువారం ఎఫ్డీసీ చైర్మన్ పరిశీలించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇండ్లులేని నిరుపేదలకు రూపా యి ఖర్చులేకుండా పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నేడు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అనేక పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు పురం మహేశ్, ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్, నేతలు ఉన్నారు.