సిద్దిపేట, మే 26 : జిల్లాలో త్వరగా ధాన్యాన్ని సేకరించాలని అడినల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో సివిల్ సైప్లె డిప్యూటీ తహసీల్దార్లు, తహల్దార్లతో ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. అక్కన్నపేట, హుస్నాబాద్ మండల్లాలో 10, 15 రోజుల్లో ధాన్యం సేకరణ ముగస్తుందని తెలిపారు. అకాల వర్షంతో ధాన్యం తడవకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని, జిల్లా మార్కెట్ యా ర్డులో టార్పాలిన్ కవర్లు ఉన్నాయని, తెచ్చుకోవాలని అధికారులను ఆదేశించారు.
అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పనిచేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. కొనుగోలు కేం ద్రాలను తహసీల్దార్లు సందర్శించి, రైతులకు సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. ధరణి పొర్టల్‌పై తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో సమీక్ష చేసి, మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తులపై దిశానిర్దేశం చేశారు. కోర్టు కేసులో ఉన్న దరఖాస్తులు, తహసీల్దార్ల వద్ద పెండింగ్‌లో ఉన్న వాటికి సంబంధించిన పహాణీలు, తదితర రికార్డులను పరిశీలించి, పొరపాట్లు లేకుండా పరిష్కరించాలని సూచించారు.
జిల్లాలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంచుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సర్వేయర్లు సర్వే చేస్తే పంచనామా ఇవ్వాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని, ప్రతి రిపోర్టును ఆర్డీవోలు తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమీక్ష సమావేశంలో డీఆర్వో చెన్నయ్య, గజ్వేల్ ఆర్డీవో విజేందర్‌రెడ్డి, సివిల్ సైప్లె డీఎం హరీశ్ పాల్గొన్నారు.