కొండాపూర్, మే 27 : ఆన్లైన్ మోసాలతో యువత జాగ్రత్తగా ఉండాలని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ సూచించారు. శుక్రవారం కొండాపూర్ మండలంలోని మల్లేపల్లి గ్రామంలో క మ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగాంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లేపల్లి గ్రామంలో ఇతర రాష్ర్టాల నుంచి వివిధ పరిశ్రమల్లో పనిచేసేందుకు కూలీలు వస్తున్నారని, అలాంటి కొత్తవారికి పూర్తి అడ్రస్ లేకుంటే ఇల్లు అద్దెకు ఇవ్వొద్దని వివరించారు. ఆన్లైన్లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అలాంటి వారికి అందరూ దూరంగా ఉండాలన్నారు.
అలాంటి వారు ఫోన్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. లేదంటే 1930కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. అలా ఇస్తే 24 గంటల్లో తమ డబ్బులను తిరిగి చెల్లించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా ఆడవాళ్లను ఎవరైనా సరే ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. దౌర్జన్యం, గుండాయిజం లాంటి కార్యకలాపాలకు పాల్పడితే పరిణామాలు మరోలా ఉంటాయన్నారు.
రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులను ఎవరైనా సరే అమ్మితే కఠిన చర్యలు ఉం టాయని షాపు యజమానులను హెచ్చరించారు. జిల్లా ఎస్పీ రమణకుమార్ ఆదేశాలతో షాపుల తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాల్లో కూడా సర్పంచ్లు, ఎంపీటీసీలు పోలీసులకు సహకరించి నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై తమ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100 నెంబర్కు లేదా, కొండాపూర్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ శివలీలా జగదీశ్వర్, కొండాపూర్ సీఐ లక్ష్మారెడ్డి, ఎస్సై వెంకటేశం, టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మ్యాకం విఠల్, గ్రామస్తులు పాల్గొన్నారు.
మునిపల్లి, మే 27 : 75వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకల్లో భాగంగా బుధేర చౌరస్తాలో తాజ్ దాబా వద్ద వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ అన్నారు. శుక్రవారం మాట్లాడుతూ రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనదారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. రోడ్డుపై జరిగే ప్రమాదాలపై కళాకారులతో ఆట, పాటలతో పలు కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కొండాపూర్ సీఐ లక్ష్మరెడ్డి ఉన్నారు.
వట్పల్లి, మే 27 : వట్పల్లి పోలీస్ స్టేషన్ను శుక్రవారం వార్షిక తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ సందర్శించి పలు రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చే యాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు, సైబర్ నేరాల గురిం చి అవగాహన కల్పించాలని ఎస్సైకి సూచించారు. కార్యక్రమం లో జోగిపేట సీఐ నాగరాజు, ఎస్సై ఆబార్య ఉన్నారు.