మెదక్ అర్బన్, మే27: మెదక్‌లో జిల్లా కోర్టు ఏర్పాటు కు రాష్ట్ర ప్రభుత్వం 9.2 ఎకరాల భూమిని కేటాయించిందని మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాల య్య తెలిపారు. దీనికి కృషి చేసిన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుభాష్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డిలకు బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. శుక్రవారం మెద క్ కోర్టు బార్ అసోసియేషన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మా ట్లాడుతూ.. మెదక్‌లో జూన్ 2 నుంచి జిల్లా కోర్టు ప్రా రంభించనున్నట్లు తెలిపారు.
మెదక్‌లో జిల్లా కోర్టు ఏర్పాటు ఎన్నో ఏండ్ల కల అని, అది త్వరలో నెరవేరుతున్నదన్నారు. జిల్లా కోర్టు ఏర్పాటు కావడంతో కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. జిల్లా కోర్టు ఏర్పాటుకు న్యాయమూర్తి పాపిరెడ్డి కూడా కృషి చేశారన్నారు. ఉమ్మడి జిల్లా ప్రస్తుత న్యాయమూ ర్తి శశిధర్‌రెడ్డి స్థల పరిశీలిన చేసి కావాల్సిన వసతులు మెదక్ కోర్టులో ఉన్నాయని హైకోర్టుకు తెలిపారన్నారు.
జిల్లా కోర్టు ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించిన కలెక్టర్ హరీశ్, ఆర్డీవో సాయిరాం, మెదక్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కోర్టు ఏర్పాటు కాబోతుండడంతో న్యాయవాదులు మిఠాయిలు తీనిపించుకుని, సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో మెదక్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ శ్రీవాత్సవ్, ట్రెజరర్ దుర్గారెడ్డి, న్యాయవాదులు శ్రీపతిరావు, సంతోష్‌రెడ్డి, జీవన్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, కిరణ్‌రాజ్, నర్సింలు, దమోదర్‌రెడ్డి పాల్గొన్నారు.