కొండాపూర్,మే 26: ప్రతి పల్లె ప్రగతి పథంలో నడుస్తున్నది. ప్రతి గ్రామం నేడు ఆదర్శంగా మారుతున్నది. మొదటి, రెండో విడుత కార్యక్రమం విజయవంతమైంది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పల్లెలన్నీ పరిశుభ్రంగా మారాయి. ఇందులో భాగంగానే గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి జీపీకి ఒక ట్రాక్టర్ , వాటర్ ట్యాంకర్లను, ట్రాలీలను కొనుగోలు చేసింది. చెత్తను తొలిగించడం, హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోయడం, ఇతర పంచాయతీ అవసరాలకోసం ట్రాక్టర్లను వినియోగించింది.
కొండాపూర్ మండలానికి 24 గ్రామ పంచాయతీలకు గాను 22 గ్రామాలకు ట్రాక్టర్లను కొనుగోలు చేసి పంచాయతీలకు అందజేసింది. 25 పెద్ద ట్రాక్టర్లు, 7 చిన్న ట్రా క్టర్లను, 28 ట్రాలీలను, 24 ట్యాంకర్లను అందించింది. ఒ క్కొక్క పెద్ద ట్రాక్టర్కు రూ. 9.30 లక్షలు, చిన్న ట్రాక్టర్కు రూ. 6.80 లక్షలు ఖర్చు చేసి గ్రామ పంచాయతీలకు అందజేసిం ది. మొత్తం ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీలు కొనుగోలు చేసేందుకు రూ. 2 కోట్ల 5 లక్షల 70 వేలను వెచ్చించింది. గ్రామా ల్లో మొక్కలను నాటి వాటిని సంక్షించడం ద్వారా ఉపాధి హామీ ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి వేలల్లో నిధులు అందనున్నాయి. వాటిని ట్రాక్టర్ల నిర్వహణ, డ్రైవర్ల వేతనాలకు వినియోగించుకునే ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు.
కొండాపూర్ మండలంలో 24 గ్రామ పంచాయతీలు. 14 ఆవాస గ్రామాలు ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు 22 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేసింది. నూతనంగా ఏర్పాటైన తమ్మలిబాయి తండా, శివ్వన్నగూడెం పంచాయతీలకు సంబంధించిన ట్రాక్టర్లకు బ్యాంక్లో డీడీలు కట్టి వాటిని కూడా పంచాయతీలకు అందించారు.
ప్రభుత్వం ప్రతి పల్లెకు ట్రాక్టర్లను పంపిణీ చేయడంతో పల్లెలు ఇక పారిశుధ్యం వైపు అడుగులు వేస్తున్నాయి. ఇంతకు ముందు పంచాయతీల్లో తీసిన చెత్తను ఎక్కడ వేయాలో తెలియక ఎన్నో ఇబ్బందులు పడ్డ పంచాయతీలు ఎన్నో ఉన్నాయి. గ్రామాల్లో పారిశుధ్యం పనులు చేయాలంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు ఎలా చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మం డలంలోని ప్రతి పల్లె ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రతి గ్రామంలో ఏ పనులు చూసినా అందంగా కనిపిస్తున్నాయి. గ్రామాల్లో తీసిన చెత్తను ప్రత్యేకంగా వేసేందుకు ట్రాక్టర్లను కొనుగోలు చేయడంతో పాటు తీసిన చెత్తను పారవేసేందుకు డంపింగ్ యార్డులను కూడా ఏర్పాటు చేసింది. పల్లెలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి.
ప్రభుత్వం పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్ల 5 లక్షల 70 వేలతో ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం అందించింది. వాటిని ఎవరైనా సొంత ప్రయోజనాలకోసం వాడుకుంటే చర్యలు తీసుకుంటాం. 24 గ్రామ పంచాయతీలకు గాను 22 గ్రామాలకు ట్రాక్టర్లను కొనుగోలు చేసి అందజేశాం. 25 పెద్ద ట్రాక్టర్లు, 7 చిన్న ట్రాక్టర్లు,28 ట్రాలీలు, 24 ట్యాంకర్లను అందించాం.
– జయలక్ష్మి, ఎంపీడీవో, కొండాపూర్