గుమ్మడిదల, మే 26: నిరుపేద కుటుంబానికి చెందిన ఆడబిడ్డ పెండ్లికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, చిట్కుల్ సర్పంచ్ నీలంమధు ఆర్థిక సాయాన్ని అందించి అండగా నిలిచారు. గురువారం బొంతపల్లి గ్రామానికి చెందిన తలారి వీరేశ్, పుణ్యవతి దంపతుల కూతరు దివ్య వివాహానికి చిట్కుల్ సర్పంచ్ నీలంమధు ముదిరాజ్ రూ. 10 వేలు ఆర్థిక సాయాన్ని పంపించగా, ఎన్ఎంఎం యువసేన మండల అధ్యక్షుడు గ్యారమల్లేశ్, ఉపాధ్యక్షులు వెంకటేశ్, నల్తూరి యాదగిరి, ప్రధాన కార్యదర్శి చింతల వీరేశ్, మాజీ ఉపసర్పంచ్ జింకగోపాల్ ఈ నగదును అందజేశారు. దీనికి వారు ఎన్ఎంఎం యువసేన వ్యవస్థాపకుడు నీలంమధుకు ధన్యవాదాలు తెలిపారు.
గుమ్మడిదల, మే 26: మండలంలోని సీజీఆర్ ట్రస్ట్ సేవలకు మండల ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. గురువారం గుమ్మడిదల గ్రామానికి చెందిన నీరుపేద చిరుమణి బాలమణియాదగిరి కూతురు కూతురు రమ్య వివాహానికి సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్గోవర్ధన్రెడ్డి జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌తో కలిసి ఆ కుటుంబానికి రూ.10 వేలు వివాహానికి ఆర్ధికసాయాన్ని అందజేశారు. వీరితో పాటు పొన్నాల శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్ మొగులయ్య,ముదిరాజ్ సంఘం గ్రామకమిటీ అధ్యక్షుడు దేవుని నర్సింహులు, టీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడు ఆంజనేయులు యాదవ్, సూర్యనారాయణ, మల్లేశ్‌యాదవ్, శ్రీకాంత్‌చారి ఉన్నారు.
సదాశివపేట,మే 26 : 3వ వార్డుకు చెందిన రోకటి సునీల్ ఖతార్ కుటుంబానికి పీఎంఆర్ డెవలపర్స్ అధినేత, కౌన్సిలర్ పులుమామిడి రాజు రూ. 10వేలు ఆర్థిక సహాయం అందజేశారు. గురువారం కౌన్సిలర్ ప్రకాశ్‌తో కలిసి రోకటి సునీల్ ఖతర్ కుటుంబ సభ్యులకు ఆయన ఆర్థిక సహాయం అందజేశారు. సునీల్ దుబాయ్‌లో పని చేసేటప్పుడు అతనికి పక్షవాతం వచ్చి కాలు, చేయి పడిపోయింది. కౌన్సిలర్ ప్రకాశ్ ఈ విషయాన్ని పులుమామిడి రాజు దృష్టికి తీసుకెళ్లగా ఆయన రూ. 10వేల ఆర్థిక సహాయం అందజేశారు. పిల్లలు చదువుకునేందుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని సునీల్ ఖతార్ కుటుంబానికి భరోసా ఇచ్చారు.