గాంధీని అవమానించడం సిగ్గుచేటు
జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాన్ని మహిషాసురమర్దినిగా దహనం చేసి అవమానపర్చిన వారికి వెంటనే శిక్షించాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దశంకరంపేట, జోగిపేట మండల, పట్టణ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో
- మహిషాసురమర్దినిగా దహనం చేసి అందరి మనోభావాలను గాయపరిచారు
- భారతీయులంతా తలదించుకునేలా చేశారు
- బాధ్యులను కఠినంగా శిక్షించాలి
- ఆర్యవైశ్య, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నిరసనలు
- గాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
అందోల్/ పెద్దశంకరంపేట, అక్టోబర్ 4: జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాన్ని మహిషాసురమర్దినిగా దహనం చేసి అవమానపర్చిన వారికి వెంటనే శిక్షించాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దశంకరంపేట, జోగిపేట మండల, పట్టణ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలోని రూబీ క్రాసింగ్ వద్ద అఖిల భారత హిందూ మహాసభ నిర్వాహకులు మండపం ఏర్పాటు చేసి దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠింరని, గాంధీ జయంతి రోజు దుర్గామాత విగ్రహంలోని మహిషాసురిడి స్థానంలో మహాత్ముడిని పోలిన బొమ్మను ఉంచి దహనం చేశారరని, ఇది జాతిపితను అవమానించడమే అవుతుందన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జోగిపేట ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్, పెద్దశంకరంపేట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బొడ్ల ప్రకాశం, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దాదిగారి గంగాధర్, మండల ఆర్యవైశ్య సంఘం యూత్ అధ్యక్షుడు కందుకూరి రవీందర్, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, బాధ్యులు సంతోష్, శేఖర్, రవీందర్, మల్లేశం, గడ్డం మల్లేశం, రాగం శ్రీనివాస్, కిరణ్, సురేశ్, సంగమేశ్వర్ తదితరులున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- Andole
- Arya Vysya
- burinng
- gandhi
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

