మెదక్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): మెదక్ అదనపు కలెక్టర్(రెవెన్యూ) వెంకటేశ్వర్లు వనపర్తి జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న మెంచు నగేశ్ బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…మెదక్ అదనపు కలెక్టర్గా గతేడాది జూలైలో బాధ్యతలు చేపట్టానని, 15 నెలలు జిల్లాలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.
ము ఖ్యంగా ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేసిన ట్లు వివరించారు. ప్రజావాణిలో వచ్చి న దరఖాస్తులను ప రిష్కరించేలా ఆ యా శాఖల అధికారులకు ఆదేశాలు ఇ చ్చామన్నారు.15 నెలల్లో వానకాలం, యా సంగి సీజన్లలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని చెప్పారు.