మెదక్ : ఈ నెల 21న మెదక్ జిల్లాలో తెలంగాణ మోడల్ స్కూల్స్ 6వ, 7వ తరగతి నుంచి పదవ తరగతి 2021-2022 అకడమిక్ సంవత్సరం ప్రవేశ అర్హత పరీక్షలు ఉన్నందున జిల్లాలోని 7 పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చందనదీప్తి తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పరీక్షా కేంద్రాల నుంచి 500 మీటర్ల వరకు ఉన్న అన్నీ జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు గుమికూడొద్దని తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆరో తరగతి పరీక్షా కేంద్రాల వివరాలు
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
తెలంగాణ మోడల్ స్కూల్ తిరుమలపూర్, పెద్దశంకరంపేట మండలం
తెలంగాణ మోడల్ స్కూల్ రేగోడ్
తెలంగాణ మోడల్ స్కూల్ కోమట్పల్లి, రామాయంపేట మండలం
తెలంగాణ మోడల్ స్కూల్ చేగుంట
తెలంగాణ మోడల్ స్కూల్ చిన్నశంకరంపేట
తెలంగాణ మోడల్ స్కూల్ జక్కపల్లి, నర్సాపూర్ మండలం
ఏడో తరగతి నుంచి పదో తరగతి పరీక్షా కేంద్రాలు
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
తెలంగాణ మోడల్ స్కూల్ తిరుమలపూర్, పెద్దశంకరంపేట మండలం
తెలంగాణ మోడల్ స్కూల్, రేగోడ్
తెలంగాణ మోడల్ స్కూల్ టేక్మాల్
తెలంగాణ మోడల్ స్కూల్ కోమట్పల్లి, రామాయంపేట మండలం
తెలంగాణ మోడల్ స్కూల్ చేగుంట
తెలంగాణ మోడల్ స్కూల్ చిన్న శంకరంపేట
తెలంగాణ మోడల్ స్కూల్ జక్కపల్లి, నర్సాపూర్ మండలం