
రామాయంపేట, జూలై 5: మొక్కలను ప్రణాళికా బద్దంగా నాటాలని, మొక్క మొక్కకు వ్యత్యాసం ఉండేలా నాటాలని ప్రతి మొక్కను ఆన్లైన్లో చూపాలని జిల్ల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు.సోమవారం రామాయంపేటకు విచ్చేసిన కలెక్టర్ నాటిన మొక్కలను ఆకస్మిక తనిఖీ చేసి కమిషనర్‌ను వివరాలు తెలుసుకున్నారు. రామాయంపేట మున్సిపల్లోని మెదక్ రోడ్డు నుంచి సిద్దిపేట చివరి రోడ్డు వరకు మొక్కలు నాటాలన్నారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా అక్కడ మొక్కలు నాటి బతికించాలన్నారు. మున్సిపల్లో వార్డుల వారీగా కమిటీలు వేసి మొక్కలకు ప్రతిరోజూ నీరు పోసి బతికించాలన్నారు. మళ్లీ మూడు రోజుల్లో వస్తానని అప్పటివరకు మొక్కలు నాటడం పూర్తి కావాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట కమిషనర్ శ్రీనివాసన్, మేనేజర్ శ్రీనివాస్, కౌన్సిలర్ దేమె యాదగిరి, కాలేరు ప్రసాద్, నవాత్ ప్రసాద్, పద్మ, దివ్య, శ్రీనివాస్ ఉన్నారు.
పల్లె ప్రగతిని పకడ్బందీగా నిర్వహించాలి
చిలిపిచెడ్,జూలై 5: పల్లె ప్రగతిపై అధికారులు,ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అదేశించారు. చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్,చండూర్,రాందాస్‌గూడ గ్రామాల్లో అకస్కాత్తుగా పల్లె ప్రకృతి, వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, నర్సరీలను, పల్లె ప్రగతి పనులను ఆమె సోమవారం తనిఖీ చేశారు. గ్రామాల్లో వీధుల్లో తిరుగుతూ..ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. చండూర్ ప్రాథమిక పాఠశాలలో హరితహారం మొక్కలను, పశువులను, పారిశుధ్యం, పిచ్చిమొక్కలను చూసి గ్రామ కార్యదర్శి, ఎంపీడీవో పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి వరకు గ్రామంలో పారిశుధ్యం,పిచ్చి మొక్కలను శుభ్రం చేసిన తర్వత నాకు వాట్సాప్‌లో ఫోటోలు పంపాలని, లేకుంటే చర్యలు కఠినంగా ఉంటాయని గ్రామ కార్యదర్శికి, ఎంపీడీవోకు తెలిపింది. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి దేవయ్య, ఎంపీడీవో శశిప్రభ, ఎంపీవో పోలేశ్వర్రాజు, తహసీల్దార్ సహదేవ్,ఏపీవో శ్యామ్‌కుమార్, ఆర్ఐ రుక్మొద్దీన్, సర్పంచులు గోపాల్‌రెడ్డి,యాదగిరి,ఆయా గ్రామ కార్యదర్శిలు జితేందర్,తిరుపతి ఉన్నారు.
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
మెదక్ మున్సిపాలిటీ, జూలై 5: ప్రజలు తమ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోని పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం పట్టణంలోని 9, 18, 28 వార్డులలో పర్యటించి పట్టణ ప్రగతి పనులను పరిశీలించి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చెత్తను రోడ్లపై వేయకుండా తడి, పోడి చెతను వేరు చేసి చెత్త వాహనాలలో వేయాలని సూచించారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరించాలన్నారు. పట్టణ ప్రగతిలో మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి ఆయా వార్డుల కౌన్సిలర్లు అకిరెడ్డి కృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణగౌడ్, కల్యాణి, మమత, రుక్మిణి, వసంత్‌రాజ్, మున్సిపల్ కమిషనర్ హరి, మున్సిపల్ డీఈ మహేశ్, ఏఈలు బాలసాయగౌడ్, సిద్దేశ్వరి, టీపీఎస్ లక్ష్మిపతి, రెవెన్యూ అధికారి, హర్షద్, వర్క్ ఇన్స్పెక్టర్లు సలీం, దుర్గపతి, ట్రాన్స్‌కో పట్టణ ఏఈ జావేద్ పాల్గొన్నారు.
కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులు
టేక్మాల్, జులై 5: మండలంలో పల్లె ప్రగతి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ధనూర, ఎలకుర్తి, కు సంగి, టేక్మాల్, బొడ్మట్‌పల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల వద్ద పరిశుభ్రత పనులను చేపట్టారు. కోరంపల్లి గ్రామంలో ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు. ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు పనులను పర్యవేక్షించారు.
హరితాహారం మొక్కలు నాటిన ఎంపీడీవో
హవేళిఘనపూర్, జూలై 5: మండల పరిధిలోని కొచ్చెరువుతండా పంచాయతీలో ఎంపీడీవో శ్రీరామ్ హరితాహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి గ్రామంలో చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా చూడాలన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అందరు ఆరోగ్యంగా ఉంటారని ఎంపీడీవో శ్రీరామ్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కొచ్చెరుతండా సర్పంచ్ తారీ, వార్డు సభ్యులు, గ్రామస్తులు శ్రీను తదితరులు ఉన్నారు.
మొక్కలు నాటిన ఎమ్మెల్యే
చేగుంట, జూలై 5 : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అనంతసాగర్, రుక్మాపూర్, పులిమామిడి గ్రామంలో ఎమ్మెల్యే రఘునంధన్‌రావు మొక్కలు నాటారు.అనంతరం కల్యాణలక్ష్మీ చెక్కులను అందించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జయరాజ్, ఎంపీడీవో ఉమాదేవి, తహసీల్దార్ విజయలక్ష్మి, సర్పంచ్ వెంకటేశంగారి లక్ష్మీసిద్దిరాములు, ఎంపీవో ప్రశాంత్, ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, సర్పంచ్ గణపురం సంతోష్‌రెడ్డి, స్థానిక నాయకులు బాగులు, మ్యాకల, వెంకటస్వామి, వడ్ల మోహన్, రాజ్‌గోపాల్ ఉన్నారు.
పల్లెప్రగతితో అభివృద్ధి
మెదక్ రూరల్, జూలై 5: పల్లెప్రగతి కార్యక్రమాలు వలన పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందుతాయన్నాయని సహాయ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా సహా య కలెక్టర్(ట్రైనీ) అశ్విని తానాజీ వాకాడే మెదక్ మండలం పాతూరులో చేపట్టిన పనులను పరిశీలించి పాఠశాల ఆవరణ త్వరితగతిన శుభ్రం చేయాలని అన్నారు. గ్రామంలో శ్మశానవాటిక, నర్సరీ, పల్లె ప్రకృతివనం, డంపింగ్‌యార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సాయిరాం, ఎంపీడీవో శ్రీరాములు, ఎంపీవో నయీం, ఎంపీపీ యమునా జయరాంరెడ్డి, సర్పంచ్ లింగమ్మ, వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు జయరాంరెడ్డి, బాలయ్య పాల్గొన్నారు.