
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పల్లె ప్రగతి‘తో పటేల్‌గూడ గ్రామ రూపురేఖలే మారిపోయాయి. ఒకప్పటి పల్లె నేడు పట్టణంగా రూపుదిద్దుకున్నది. గతంలో పటేల్‌గూడ గ్రామం అత్యంత వెనుకబడిన ఓ చిన్న పల్లె. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో నిధులు లేక అభివృద్ధికి నోచుకోని గ్రామం నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధికి మారు పేరుగా మారింది. పుష్కలమైన నిధులతో గ్రామ పంచాయతీలో విశాలమైన రహదారులు, భవనాలు, ఆలయాలు, హైమాస్ట్ విద్యుత్ దీపాలు, పార్కు, అందమైన చెరువు, ప్రకృతి వనంతో కళకళలాడుతూ దర్శనమిస్తున్నాయి. గ్రామంలో కొత్తకొత్త కాలనీలు వెలుస్తుండడం, జనాభాకనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రణాళికాబద్ధంగా ముందుకు దూసుకుపోతుంది.
‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలు
ప్రభుత్వం నెల నెలా నిధులు విడుదల చేస్తుండడంతో గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని రూ.కోటీ 20 లక్షలతో నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. గ్రామంలో నగరానికి దీటుగా రహదారుల నిర్మాణంతో పాటు కాలనీల్లో సీసీ, బీటీ రోడ్లను నిర్మించారు. బీఎస్ఆర్ కాలనీలో రూ.30లక్షలతో సీసీరోడ్లు, ప్రణీత్ కౌంటి కాలనీ మెయిన్ గేట్ నుంచి కిలోమీటరు వరకు రూ.90లక్షలతో సీసీరోడ్లు, ఇందిరమ్మ కాలనీలో రూ.15లక్షలతో మెటల్ రోడ్లు, సిద్ధార్థ కాలనీలో రూ.22లక్షలతో అంతర్గత రోడ్లు, సూర్యోదయ కాలనీ నుంచి ఇందిరమ్మ కాలనీ మీదుగా బీరంగూడ, కిష్టారెడ్డి మేయిన్ రోడ్డు వరకు రూ.4కోట్ల 20లక్షలతో బీటీ రోడ్లు, గీతా హోమ్స్‌లో రూ.70లక్షలతో అంతర్గత రోడ్లను నిర్మించారు. అన్ని కాలనీల్లో అండర్‌గ్రౌండ్ డైనేజీల నిర్మాణం, సృజన లక్ష్మీ కాలనీ ఫేజ్-3లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. రెండు కోట్లతో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా సూర్యోదయ కాలనీలో రూ.50లక్షలతో శివాలయం నిర్మాణం కొనసాగుతుంది.
చెరువు, కుంటల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు..
పంచాయతీ పరిధిలో చెరువు, కుంటల పరిరక్షణ కోసం గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రత్యేక చర్యలు తీసుకుంది. చెరువు, కుంటల చుట్టూ కంచెలు వేశారు. గ్రామంలో నిత్యం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. బతుకమ్మ ఘాట్లను నిర్మించారు. మిషన్‌భగీరథ ద్వారా గ్రామంలో ఇంటింటికీ తాగునీరును అందిస్తున్నారు.
గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం..
గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. గతంలో పార్కులు నగరాలకే పరిమితమయ్యేవి కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా గ్రా మంలోని వీఆర్సీ కాలనీలో విశాలమైన పార్కును నిర్మించింది. పార్కులో వా కింగ్ ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేసింది. రోడ్డుకు ఇరువైపులా హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. సీసీ కెమెరాలు, హైమాస్ట్ లైట్ల ఏర్పాటుతో గ్రామం విద్యుత్ వెలుగులతో జిగేల్ మంటున్నది.
గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది..
పటేల్‌గూడ గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తుల సమష్టి కృషితో పలు చకాచకా జరుగుతున్నాయి. గ్రామానికి అవసరమైన నిధులు కేటాయిస్తుండడంతో గ్రామంలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పంచాయతీ పాలకవర్గం పరిష్కరిస్తున్నది. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడంతో పాటు పల్లెప్రకృతి వనం, డంపింగ్ యార్డు, రైతు వేదికల నిర్మాణం చేపట్టాం. దీంతో పటేగూడ గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.