
పెద్దశంకరంపేట,జూలై 4: సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో పల్లెలన్నీ పచ్చని ప్రకృతితో విలసిల్లాలని తలపెట్టిన పల్లెప్రకృతిలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసి గ్రీన్ తెలంగాణకు అందరూ సహకరించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నాల్గో విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు పండ్ల మొక్కలు పంపిణీ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఇంట్లో ఆరు మొక్కలు నాటాలని, మహిళా సంఘాల సభ్యులు మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం అధికారులను ప్రజాప్రతినిధులను, ప్రజలను భాగస్వాములు చేసుకొని ఏడో విడుత హరితహరం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
మండల పరిధిలోని మూసాపేట, కోళ్లపల్లి గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు శ్రీనివాస్‌రెడ్డి, చాకలి నారాయణ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీపంతులు, సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, ఎంపీటీసీ వీణా సుభాశ్‌గౌడ్, ఎంపీడీవో రాంనారాయణ, ఏపీవో సుధాకర్, ఏపీఎం గోపాల్, ఈవో విఠల్, నాయకులు మాణిక్‌రెడ్డి, తదితరులున్నారు.
కొనసాగుతున్న ‘పట్టణ ప్రగతి’
మెదక్ మున్సిపాలిటీ,జూలై 4: జిల్లా కేంద్రంలోని అన్ని వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవాలని మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ పిలుపినిచ్చారు. ఆదివారం పట్టణంలో 4, 9,12వ వార్డుల్లో పర్యటించి పట్టణ ప్రగతి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కూల్చివేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.చైర్మన్ వెంట కౌన్సిలర్లు నర్మద, కల్యాణి, కిషోర్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి,డీఈ మహేశ్, ఏఈలు బాలసాయగౌడ్, సిద్దేశ్వరి, శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత, టీపీఎస్ లక్ష్మీపతి, వర్క్ ఇన్స్పెక్టర్ సలీం ఉన్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమాలను పరిశీలించిన జడ్పీ సీఈవో
హవేళిఘనపూర్,జూలై 4: హవేళిఘనపూర్తో పాటు మండల పరిధిలోని తొగిట గ్రామంలో జడ్పీ సీఈవో శైలేశ్ ఆదివారం పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. పది రోజుల పాటు చేపట్టనున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న వివిధ రకాల పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి గ్రామాల్లో చేపడుతున్న పనులు, నర్సరీలను పరిశీలించారు. జడ్పీ సీఈవో వెంట ఎంపీడీవో శ్రీరామ్, ఎంపీఈవో ప్రవీణ్‌కుమార్, ఏపీవో రాజ్‌కుమార్, సర్పంచ్‌లు మంద శ్రీహరి, సవిత తదితరులు ఉన్నారు.
పల్లెప్రగతిలో పోలీసులు
హవేళిఘనపూర్, జూలై 4: ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పోలీసు సిబ్బంది మహేందర్, శంకర్‌నాయక్ పల్లె ప్రగతి కార్యక్రమంలో పిచ్చిమొక్కలను తొలగించారు. కార్యక్రమంలో సర్పం చ్ దేవాగౌడ్, ఉప సర్పంచ్ బయ్యన్న పాల్గొన్నారు.
ఎల్లాపూర్‌లో శ్రమదానం
పాపన్నపేట,జూలై 4: గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎల్లాపూర్ సర్పంచ్ పబ్బతి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పల్లెప్రగతిలో భాగంగా ఆదివారం గ్రామ సర్పంచ్ పబ్బతి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రమధానం నిర్వహించారు. గ్రామంలోని సీసీ రోడ్లను శుభ్రపరిచి చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
చిన్నశంకరంపేట, జూలై 4: మండలంలోని వివిధ గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో రోడ్లను శుభ్రం చేశారు. అనంతరం మొక్కలను పంపిణీ చేశారు. ఎంపీడీవో గణేశ్‌రెడ్డి మాట్లాడు తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు.
ఇంటింటికీ ఆరు మొక్కలు
మెదక్ రూరల్,జూలై 4: పచ్చదనం పరిశుభ్రత ల క్ష్యంతో పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టడంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాయన్‌పల్లి సర్పంచ్ సిద్దాగౌడ్ అన్నారు. రాయిన్‌పల్లి, మంబోజిపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి, హరితహారంలో భాగంగా సర్పంచ్‌లు సిద్దాగౌడ్ , ప్రభాకర్, ఎంపీటీసీ శ్రీహరి పంచాయతీ పాలకవర్గ సభ్యులు పల్లెలో శ్రమదానంలో భాగంగా రోడ్లు శుభ్రం చేశారు. ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేశారు.