
చిలిపిచెడ్,జూలై 2: హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఏడో విడుత హరితహారం,నాల్గో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం మండలంలోని జగ్గంపేట,గంగారం, అజ్జమర్రి, బండపోతుగల్, ఫైజాబాద్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 24 శాతంగా ఉన్న అడవులను 33 శాతానికి పెంచేలా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.
నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తాం:
దసరా తర్వాత మండలంలోని ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని బండపోతుగల్‌కు చెందిన జిల్లా రైతుబంధు సభ్యుడు సయ్యాద్ హుస్సేన్‌ను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పరామర్శించారు. కార్యక్రమంలో ఎం పీపీ వినోద దుర్గారెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి , మండల ప్రత్యేక అధికారి దేవయ్య,ఎంపీడీవో శశిప్రభ, తహసీల్దార్ సహదేవ్,ఏపీవో శ్యామ్‌కుమార్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ నగేశ్,సొసైటీ వైస్ చెర్మన్ రాంచంద్రారెడ్డి,ఎంపీటీసీ సుభాష్‌రెడ్డి, మల్లయ్య, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
ముమ్మరంగా పల్లె ప్రగతి
చేగుంట,జూలై 2: చేగుంట మండలపరిధిలోని పలు గ్రామా ల్లో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మండల ప్రత్యేక అధికారి జయరాజ్,ఎంపీడీవో ఉమాదేవి మండలంలోని పలు గ్రామాల్లో పనులను పర్యవేక్షిస్తున్నారు. చందాయిపేటలో సర్పంచ్ బుడ్డ స్వర్ణలత రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు గ్రామస్తులతో కలిసి గుం తలను ఏర్పాటు చేశారు. చేగుంటలో సర్పంచుల ఫోరం మం డల అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్,ఈవో రాణి,పాలక వర్గం సభ్యులతో కలిసి పాత ఇండ్లను జేసీబీతో తొలిగించారు. ఇబ్రహీంపూర్లో, మక్కరాజిపేటలో పంచాయతీ కార్యదర్శి ఎల్లం రోడ్లకు ఇరువైపులా ఉన్న కలుపు మొక్కలను తొలిగింపజేశారు.ఉల్లితిమ్మాయిపల్లి ప్రత్యేక అధికారి, ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శి సంతోశ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటించారు.రెడ్డిపల్లిలో గ్రామ ప్రత్యేక అధికారి ఏపీఎం లక్ష్మీనర్సమ్మ మహిళాసంఘాల ఆధ్వర్యంలో కలుపు మొక్కలను తొలిగింపజేశారు.చిన్నశివునూర్లో సర్పంచ్ అశోక్ రోడ్లకు ఇరువైపుల కలుపు మొక్కలను తొలిగించి మొక్కల కోసం గుంతలు ఏర్పాటు చేయించారు.
నార్సింగిలో జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి,సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఎర్రం అశోక్ ఆధ్యర్యంలో మొ క్కలు నాటారు. మండల ప్రత్యేక అధికారి జగదీశ్, సొసైటీ చైర్మన్ శంకర్‌గౌడ్, రైతు బంధు మండల అధ్యక్షుడు లింగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తౌర్యనాయక్, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశంగౌడ్, ఉపసర్పంచ్ యోగి మొక్కలు నాటారు.
రామాయంపేట…
రామాయంపేట, జూలై 2: నాల్గో విడుత పల్లె ప్రగతి, 7వ విడుత హరితహారంలో భాగంగా పట్టణంలోని వ్యవ సాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి వ్యవ సాయ మార్కెట్ కమిటీ ఆవరణలో వంద మొక్కలను నాటా రు. మండలంలోని కోనాపూర్‌లో పారిశుధ్య కార్మికులతోఎంపీపీ నార్సింపేట భిక్షపతి కలుపు మొక్కలను తొలిగింపజేశారు. ఝాన్సీలింగాపూర్, తొనిగండ్ల, అక్కన్నపేటలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్‌రావు, ఎంపీడీవో యాదగిరిరెడ్డిలు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి జ్ఞానేశ్వర్, కౌన్సిలర్ దేమె యాదగిరి, సర్పంచ్‌లు మహేం దర్‌రెడ్డి, మైలారం శ్యాములు, కార్యదర్శులు ఉన్నారు.
నిజాంపేట…
నిజాంపేట,జూలై 2: పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని ఎంపీపీ సిద్ధిరాములు అన్నారు. ఆయ న మండల ప్రత్యేకాధికారి విజయలక్ష్మితో కలిసి నస్కల్,నగరంలోహరితహారం, పల్లెప్రగతిలో భాగంగా చెత్తను తొలిగిస్తూ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీవో రాజేందర్,ఏపీవో శ్రీనివాస్,నస్కల్ ఇన్చార్జి సర్పంచ్ కవిత,వార్డు సభ్యులు,గ్రామస్తులు ఉన్నారు
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని నందిగామ ప్రత్యేకాధికారి లక్ష్మి,హెల్త్ సూపర్వైజర్ శ్యామల అన్నారు . శుక్రవారం నందిగామలో డ్రై డే సందర్భంగా పలు వీధుల్లో పర్యటిస్తూ తడి,పొడి చెత్తపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ ఆరిఫ్ హుస్సేన్, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు ఉన్నారు.
నర్సాపూర్‌లో…
నర్సాపూర్,జూలై2: మండల పరిధిలోని పెద్దచింతకుంటలో 4వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. గ్రామంలోని సీసీ రోడ్లపై పేరుకుపోయిన మట్టిని ట్రాక్టర్ సహాయంతో తొలిగించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తూప్రాన్‌లో ఊపందుకున్న పట్టణప్రగతి
తూప్రాన్ రూరల్, జూలై 2 : తూప్రాన్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో పట్టణప్రగతి కార్యక్రమాలను నిర్వహిచారు.2,3 వార్డుల్లో పరిసరాలను శుభ్రం చేశారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ మోహ న్, కౌన్సిలర్లు మామిడి వెంకటేశ్, ఉమాసత్యలింగం, ఆర్ఐ రమేశ్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.గ్రామాల్లో పల్లెప్రగతిలో భాగంగా రోడ్లు, ప్రభుత్వ స్థలాలు,ఖాళీ ప్రదేశాల్లో కలుపు మొక్కలు తొలిగించి శుభ్రం చేశారు.ఘనపూర్‌లో ఎంపీపీ గడ్డిస్వప్న,ఎంపీడీవో అరుంధతి, ఎంపీవో రమేశ్, ఈజీఎస్ ఏపీవో సంతోష్‌రెడ్డి హరితహారం మొక్కలను నాటారు.గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ఇంటింటికీ తిరుగుతూ 6 మొక్కలను అందజేశారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
వెల్దుర్తిలో
వెల్దుర్తి, జూలై 2: గ్రామాల్లో ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటి సంరక్షించాలని మండల ప్రత్యేక అధికారి, ఏపీడీ స్వప్న అ న్నారు. మండలంలోని కుకునూర్‌లో హరితహారంలో భా గంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటించి, ట్రీగార్డుల ను ఏర్పాటు చేయించారు.వీరివెంట కార్యదర్శి రేణుక, సిబ్బంది ఉన్నారు.
మనోహరాబాద్‌లో..
మనోహరాబాద్, జూలై 2: మనోహరాబాద్‌లో హరితహారంలో భాగంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్, నాయకుడు దాసరి నరేశ్ ముదిరాజ్‌లు మొక్కను నాటారు.