పాపన్నపేట, జూలై 7 : ఆషాఢమాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ్గాభవానీ మాతను శాకాంబరి రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. ఆదివారం వేకువజాము నుంచే ఏడుపాయలకు భక్తు లు తరలిరావడంతో జాతరను తలపించింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు మంజీరా నదిలోని పాయల్లో పుణ్యస్నానాలు చేశారు. అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలానీలాలు, బోనా లు సమర్పించి మొక్కుకున్నారు. ఆలయ చైర్మన్ సతెల్లి బాలగౌడ, ఈవో కృష్ణప్రసాద్, సిబ్బంది రవివీర్కుమార్, సూర్యశ్రీనివాస్ ,మధుసూదన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, నర్సింలు, వరుణాచారి, రాజు, యాదగిరి, శ్రీకాంత్ భక్తులకు సేవలందించారు. వేదపండితులు శంకరశర్మ, పార్ధివశర్మ, మురళీధర్, రాజశేఖర్ ప్రత్యేక పూజాలు నిర్వహించారు. పాపన్నపేట్ ఎస్సై నరేశ్ తన సిబ్బందితో కలిసి బందోబస్తు విధులు నిర్వర్తించారు.