పటాన్చెరు, ఫిబ్రవరి 16: చరిత్రలో నిలిచిపోయేలా పటాన్చెరులో ఒకేసారి సామూహిక వివాహాలు చేసేందుకు నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. గురువారం పటాన్చెరు మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మే 7న పటాన్చెరు జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గంలోని హిందూ యువతీ యువకుల వివాహాలు చేయనున్నట్లు తెలిపారు. జీవీఆర్ ఎంటర్ ప్రైజెస్ సౌజన్యంతో ఎన్ని జంటలు వచ్చినా వివాహాలు జరిపిస్తామన్నారు. అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలకు దరఖాస్తులు చేసుకున్న పెళ్లికొడుకు, పెళ్లికూతుర్ల వివరాలు విచారించి, గొప్పగా పెళ్లి చేస్తామన్నారు. అమ్మాయి తరఫున వందమంది, అబ్బాయి తరఫున వందమందికి విందు భోజనాలు పెడతామన్నారు. ముస్లిం మైనార్టీలు, క్రిష్టియన్ల పెళ్లీలు ఒక తేదీ పెట్టుకుని చేస్తామన్నారు.
ఈ సామూహిక వేదికలో పెళ్లి చేసుకున్న జంటలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లో రూ.లక్ష 116 కూడా అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు ఈర్ల దేవానంద్, సుష్మ శ్రీవేణుగోపాల్రెడ్డి, జడ్పీటీసీ సుప్రజా వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీలు సుధాకర్‌రెడ్డి, సుప్రజా వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, గూడెం యాదమ్మ, గూడెం మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, బీఆర్ఎస్ నాయకులు వెంకటేశంగౌడ్, బి.వెంకట్‌రెడ్డి, దశరథ్‌రెడ్డి, మెరాజ్‌ఖాన్, షకీల్, శ్రీధర్‌చారి, చంద్రశేఖర్‌రెడ్డి, చందుముదిరాజ్ పాల్గొన్నారు.